IND vs ENG 3rd Test: సొంతగడ్డపై జడేజా సెంచరీ..భారీ స్కోర్ దిశగా భారత్

IND vs ENG 3rd Test: సొంతగడ్డపై జడేజా సెంచరీ..భారీ స్కోర్ దిశగా భారత్

ఇంగ్లాండ్ తో రాజ్ కోట్ వేదికగా జరుగుతున్న టెస్టులో టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా సెంచరీతో కదం తొక్కాడు. సొంతగడ్డపై 100 పరుగుల మార్క్ అందుకొని తన సెంచరీని స్పెషల్ గా మార్చుకున్నాడు. 198 బంతుల్లో 7 ఫోర్లతో సెంచరీ పూర్తి చేసుకున్న జడ్డూ.. టెస్టుల్లో 4వ సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు. జడేజాతో కెప్టెన్ రోజిత్ శర్మ సెంచరీ బాదడంతో భారత్ భారీ స్కోర్ దిశగా పరుగులు పెడుతుంది. ఈ మ్యాచ్ లో నెంబర్ 5 లో వచ్చి పర్ఫెక్ట్ ఇన్నింగ్స్ ఆడాడు.

    3 వికెట్లకు 185 పరుగులతో టీ విరామం తర్వాత భారత్ బ్యాటింగ్ ప్రారంభించింది. తొలి రెండు సెషన్ లు ఆచి తూచి బ్యాటింగ్ చేసిన మనోళ్లు.. మూడో సెషన్ లో దూకుడు పెంచారు. సెంచరీ తర్వాత రోహిత్ బ్యాట్ ఝళిపించాడు. వేగంగా ఆడే క్రమంలో 196 బంతుల్లో  బంతుల్లో 131 పరుగులు చేసి ఔటయ్యాడు. రోహిత్ శర్మ, జడేజా నాలుగో వికెట్ కు 204 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. రోహిత్ అవుట్ తర్వాత.. జడేజాకు జత కలిసిన సర్ఫరాజ్ ప్రారంభం నుంచే వేగంగా ఆడటం మొదలు పెట్టాడు. ఆడుతుంది తొలి టెస్ట్ అయినా బౌండరీల వర్షం కురిపించాడు. 

7 ఫోర్లు, ఒక సిక్సర్ తో 48 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. 62 పరుగులు చేసిన సర్ఫరాజ్ రనౌటయ్యాడు. ప్రస్తుతం భారత్ ఐదు   వికెట్ల నష్టానికి 315 పరుగులు చేసింది. క్రీజ్ లో సెంచరీ హీరో జడేజా(100)తో పాటు కుల్దీప్ యాదవ్(0) ఉన్నారు. ఇంగ్లాండ్ బౌలర్లలో మార్క్ వుడ్ కు మూడు వికెట్లు, హార్టిలికి ఒక వికెట్ దక్కింది.