స్కూళ్లకు వెళ్లొద్దని ఆడపిల్లలపై విషప్రయోగం : ఇరాన్ డిప్యూటీ మంత్రి

స్కూళ్లకు వెళ్లొద్దని  ఆడపిల్లలపై విషప్రయోగం : ఇరాన్ డిప్యూటీ మంత్రి

బాలికలు స్కూళ్లకు వెళ్లకూడదనే ఉద్దేశ్యంతో పవిత్ర నగరమైన కోమ్‌లోని పాఠశాల విద్యార్థినులపై కొంతమంది విష ప్రయోగం చేస్తున్నారని ఇరాన్ డిప్యూటీ మంత్రి స్పష్టం చేశారు. టెహ్రాన్‌కు దక్షిణంగా ఉన్న కోమ్‌లో గత కొన్ని రోజుల క్రితం పాఠశాలలోని వందలాది విద్యార్థినులపై విషప్రయోగం కారణంగా శ్వాసకోశ సమస్యలు ఎదుర్కొన్నారు. ఈ విషయాన్ని డిప్యూటీ హెల్త్ మినిస్టర్, యూనెస్ పనాహి పరోక్షంగా ధృవీకరించారు. ఈ ఘటన తర్వాత కొంతమంది అన్ని పాఠశాలలను ముఖ్యంగా బాలికల పాఠశాలలకు పంపడాన్ని ఆపేయాలని  కోరినట్లు తెలిసిందని ఐఆర్ఎన్ఏ వార్తా సంస్థ పేర్కొంది. అయితే ఇంత జరుగుతున్నా ఈ ఘటనలో ఏ ఒక్కరినీ అరెస్టు చేయకపోవడం గమనార్హం. ఫిబ్రవరి 14న కొంతమంది విద్యార్థులు అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రిలో చేరారు.

ఈ విషయంపై అధికారులను వివరణ కోరేందుకు విద్యార్థుల తల్లిదండ్రులు నగర గవర్నరేట్ కు చేరి నిలదీశారని ఐఆర్ఎన్ఏ తెలిపింది. ఆ తర్వాతి రోజు ప్రభుత్వ ప్రతినిధి అలీ బహదోరి జహ్రోమి విషప్రయోగాలకు గల కారణాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నామని సమాధానమిచ్చారు. ఈ ఘటనపై గత వారమే ప్రాసిక్యూటర్ జనరల్ మహ్మద్ జాఫర్ మోంటాజెరి న్యాయ విచారణకు ఆదేశించారు. అయితే ఇరాన్ లో హిజాబ్ ధరించినందుకు గాను 22 ఏళ్ల ఇరానియన్ కుర్ద్ మహ్సా అమ్నీని కస్టడీలో తీసుకోగా.. ఆమె డిసెంబర్ 16 న మరణించింది. ఈ సంఘటనపై నిరసనలు ఆగకముందే..  విద్యార్థులపై విషప్రయోగం వెలుగులోకి వచ్చి మరింత చర్చనీయాంశంగా మారింది.