చెన్నైలో ‘నో ప్లాస్టిక్ అవేర్ నెస్ రివర్స్ రన్’

చెన్నైలో ‘నో ప్లాస్టిక్ అవేర్ నెస్ రివర్స్ రన్’

చెన్నై: ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కలిగించేందుకు చెన్నైలో ఓ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. ప్లాస్టిక్ వాడకంపై అవగాహన కల్పించే లక్ష్యంతో బసంత్ నగర్ బీచ్ లో రివర్స్ వాక్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి మా సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. వందల సంఖ్యలో రోడ్డు మీదకి వచ్చిన జనం... వెనక్కి పరుగెత్తుకుంటూ ప్లాస్టిక్ పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మంత్రి మా సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ... ప్లాస్టిక్ వాడకం వల్ల ప్రకృతి సమతుల్యత దెబ్బ తింటుందన్నారు. ప్లాస్టిక్ వాడకం వల్ల మానవాళికి తీరని నష్టం వాటిల్లే ప్రమాదం పొంచి ఉందన్నారు. ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించుకోవాలని సూచించారు.