జనగామ/ ములుగు/ జయశంకర్ భూపాలపల్లి/ కాశీబుగ్గ, వెలుగు: ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయని ఆఫీసర్లు తెలిపారు. జనగామ కలెక్టరేట్లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రజల నుంచి వివిధ సమస్యలపై మొత్తం 247 అప్లికేషన్లు వచ్చాయని తెలిపారు. ములుగులో అడిషనల్ కలెక్టర్లు మహేందర్జి, సంపత్రావు అర్జీలను స్వీకరించగా, మొత్తం 59 దరఖాస్తులు వచ్చినట్లు వారు పేర్కొన్నారు.
అనంతరం వారు జిల్లా సంక్షేమ అధికారి ఈపీ ప్రేమలత అధ్యక్షతన బాలల భద్రత, డ్రగ్స్ రహిత తెలంగాణ వారోత్సవాల్లో పాల్గొని పలు సూచనలు చేశారు. జయశంకర్ భూపాలపల్లిలో మొత్తం 73 దరఖాస్తులు వచ్చాయని అడిషనల్ కలెక్టర్ పి.అశోక్ కుమార్ తెలిపారు. వరంగల్ కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 153 దరఖాస్తులు వచ్చాయని అడిషనల్ కలెక్టర్వైవీ గణేశ్పేర్కొన్నారు.

