హంట్ కు హాలీవుడ్ టచ్

హంట్ కు హాలీవుడ్ టచ్

సుధీర్ బాబు పోలీస్‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌గా నటిస్తోన్న హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌‌‌‌ ‘హంట్’. మహేష్ దర్శకుడు. వి. ఆనంద ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌‌‌‌‌‌‌‌తో పాటు ‘పాపతో పైలం’ అంటూ అప్సరరాణి చేసిన స్పెషల్‌‌‌‌ సాంగ్‌‌‌‌కు చక్కని స్పందన లభించింది. ఇక ఇందులో యాక్షన్ సీన్స్ చాలా కొత్తగా ఉండబోతున్నాయని, ఇంటర్నేషనల్‌‌‌‌ స్టాండర్డ్స్‌‌‌‌లో వీటిని తీశామని చెబుతున్నారు మేకర్స్. హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్స్ రేనాడ్ ఫవెరో, బ్రయాన్ విజియర్ ఈ సినిమాకు స్టంట్స్ కంపోజ్ చేశారు. ‘మార్వెల్ స్టూడియోస్ నిర్మించిన పలు అంతర్జాతీయ చిత్రాలకు పనిచేసిన వీరిద్దరూ త్వరలో వస్తున్న ‘జాన్‌‌‌‌ విక్‌‌‌‌ 4’కి కూడా వర్క్ చేశారు. ‘వీళ్లు కంపోజ్ చేసిన స్టంట్స్ ‘హంట్’ చిత్రానికి స్పెషల్ అట్రాక్షన్‌‌‌‌గా నిలవబోతున్నాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. త్వరలోనే రిలీజ్ డేట్‌‌‌‌ను అనౌన్స్ చేస్తాం’ అని నిర్మాత చెప్పారు. శ్రీకాంత్,  భరత్, మైమ్ గోపి, కబీర్ దుహన్ సింగ్, గోపరాజు రమణ, చిత్రాశుక్ల ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తుండగా.. జిబ్రాన్ సంగీతం అందిస్తున్నాడు.