
పెళ్లి.. .. ఈ రోజుల్లో బొమ్మలాటైపోయింది. పెళ్లెందుకు చేసుకుంటున్నారో కూడా తెలియట్లేదు చాలా మందికి. నచ్చినన్ని రోజులు కలిసి ఉండటం.. ఇప్పుడు రోజులు కాదండోయ్ నచ్చినన్ని గంటలే ఉండి... చిన్న చిన్న విషయాలకే విడిపోవడం వంటి ఘటనలు జరుగుతున్నాయి. నాతిచరామి అని ఇలా ప్రమాణం చేశాడో లేదో...24 గంటలకే భార్యకు విడాకులిచ్చేశాడు.
పెళ్ళయి 24 గంటలే .... కానీ ఆ మహిళ చాలా అలసిపోయింది. హానీమూన్ ట్రిప్ లో రొమాన్స్ చేయలేదనే కారణంతో ఈ జంట విడాకులు తీసున్నారు. ఈ విషయాన్ని ఆస్ట్రేలియాలో 'హాట్ నైట్స్ విత్ ఏబీ చాట్‌ఫీల్డ్' అనే రేడియో షో కు రేషియల్ అనే మహిళ ఫోన్ చేసి తన మాజీ భర్త గురించి షాకింగ్ విషయం చెప్పింది.
రేషియల్ అనే మహిళకు వారి సాంప్రదాయంగా అంగరంగ వైభవంగా వివాహం చేశారు. పెళ్లిలో, పెళ్లి తరువాత చాలా ఉత్సాహంగా గడిపారు. ఆరోజు వారికి ప్రత్యేకమైన రోజు.. సాధారణంగా పెళ్లయిన నవ దంపతులు ప్రైవసీ కోసం హానీమూన్ ట్రిప్ ఏర్పాటు చేసుకుంటారు. అలానే రేషియల్ దంపతులు పెళ్లయిన 24 గంటలకే వారి సంప్రదాయాలను పూర్తిచేసుకొని ప్రైవసీ కోసం హనీమూన్ వెళ్లారు. ఈ ట్రిప్ వారి జీవితంలో మరుపురాని అనుభూతిని కలిగిస్తుందని భావించిన... ఆమహిళకు అత్యంత చెత్త అనుభవాన్ని మిగిల్చింది. హనీమూన్ ట్రిప్ లో పెళ్లయిన మొదటి రాత్రి తరువాత విడాకులు ఇమ్మని రేషియల్ భర్త అడిగాడని రేడియో షో లో ఆమె తెలిపింది.
భర్త ప్రవర్తనే ఇందుకు కారణం..
రేషియల్ అనే మహిళ ఆస్ట్రేలియాలోని రేడియో షోలో 'హాట్ నైట్స్ విత్ ఏబీ చాట్‌ఫీల్డ్'కి కాల్ చేసి తన మాజీ భర్త గురించి ఆశ్చర్యకరమైన విషయం చెప్పింది. పెళ్లయిన రెండు వారాలకే అధికారికంగా విడాకులు తీసుకున్నట్లు ఆ మహిళ చెప్పింది. దీనికి కారణం హనీమూన్‌లో ఇద్దరూ రొమాన్స్ చేయకపోవడంతో ఫస్ట్ నైట్ తర్వాత భర్త విడాకులు కోరాడని తెలిపింది.
రొమాన్స్ చేయలేదని
పెళ్లిరోజు రాత్రి తాము వాకింగ్‌కి వెళ్లామని.. అక్కడ బాగా అలసిపోనని రేషియల్ రేడియో షోలో చెప్పింది. వారు బస చేసిన హోటల్‌కు తిరిగి వచ్చినప్పుడు తాను బాగా అలసిపోయి ఉన్న సమయంలో భర్త రొమాన్స్ చేయమని అడిగాడు. అయితే రేషియల్ చాలా అలసిపోయిందని ఆమె నిరాకరించింది. దీంతో భర్త తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడని ఆమె చెప్పింది. పెళ్లయిన మరుసటి రోజే 24 గంటలు కూడా గడవకపోవడంతో భర్త విడాకుల అంశాన్ని లేవనెత్తాడు.రేషియల్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసి విడాకులు కోరాడని తెలిపాడు
రెండు వారాల్లోనే ...
రేషియల్ జంట వివాహం అయిన రెండు వారాలకే అధికారికంగా విడిపోయారు. తాను సరైన పనే చేశానని మరియు వివాహం తర్వాత ప్రజలు తరచుగా అలసిపోతారు కాబట్టి అది తన తప్పు కాదు. ఈ అనుభవం తనను చాలా నిరాశకు గురి చేసిందని, ఇప్పుడు తన భర్త నుండి పూర్తిగా విడిపోవాలనుకుంటున్నానని తెలిపింది.