కుటుంబ కలహాలతో భార్యను నరికి చంపిన భర్త

V6 Velugu Posted on Apr 25, 2021

రంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. కట్టుకున్న భార్యను కడతేర్చాడో కసాయి భర్త. భార్యతో గొడవపడి.. గొడ్డలితో నరికి చంపాడు. ఈ ఉన్మాద ఘటన కందుకూరు మండలం దాసర్లపల్లిలో జరిగింది. గ్రామంలో మహేందర్, సారమ్మ (30) దంపతులు నివసిస్తున్నారు. వీరిద్దరి మద్య కొంతకాలం నుంచి గొడవలు జరుగుతున్నాయి. శనివారం రాత్రి కూడా వీరిద్దరూ గొడవపడ్డారు. అనంతరం తీవ్ర ఆగ్రహానికి లోనైన మహేందర్.. భార్యను గొడ్డలితో నరికి చంపాడు. స్థానికుల ఫిర్యాదుతో కందుకూరు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని సారమ్మ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చరీకి తరలించారు. మహేందర్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు.. పరారీలో ఉన్న అతని కోసం గాలిస్తున్నారు. 

Tagged Telangana, murder, family issues, husband killed his wife, kandukooru murder

Latest Videos

Subscribe Now

More News