
సికింద్రాబాద్,వెలుగు: తన ప్రవర్తన మార్చుకోవాలని భార్యకు చెప్పినా వినకపోవడంతో భర్త మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్న ఘటన సనత్‌నగర్ పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. ఫతేనగర్‌కు చెందిన పవన్ నీమ్కర్(34)కి 2016లో మౌలాలికి చెందిన ప్రియాంకతో పెండ్లి అయ్యింది. కొంతకాలం సంసారం సాఫీగానే సాగినా, సంతానం లేకపోవడంతో దంపతుల మధ్య గొడవలు వస్తున్నాయి. ప్రియాంక డ్యాన్సులు, యాక్టింగ్ చేసిన వీడియోలను ఇన్స్టాగ్రామ్,ఫేస్బుక్లో అప్లోడ్ చేయడం చేస్తుంది. ఇలాంటి పనులు మానుకోవాలని భర్త చెప్పినా ఆమె వినలేదు. ఇద్దరి మధ్య గొడవలు మరింత పెద్దగా మారాయి. కరోనా కష్టకాలంలో పవన్ జాబ్ కోల్పోవడంతో తీవ్ర ఇబ్బందులు వచ్చాయి. శుక్రవారం భార్యను ఆమె పుట్టింట్లో వదిలిపెట్టి వచ్చాడు. అదేరోజు రాత్రి మరోమారు దంపతులు ఫోన్లో మాట్లాడుకుంటూ గొడవపడ్డారు. ఓ వైపు భార్య ప్రవర్తన.. మరోవైపు ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక మనస్తాపంతో పవన్ ఆదివారం ఇంట్లో ఉరివేసుకుని చనిపోయాడు. కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా వచ్చి డెడ్‌బాడీని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కోడలు ప్రియాంకనే కారణమని మృతుడి కుటుంబ సభ్యులు, తన భర్త మృతిపై అనుమానాలు ఉన్నాయని భార్య ప్రియాంక సనత్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇరువురి ఫిర్యాదులు తీసుకుని కేసు నమోదు చేసినట్టు సనత్ నగర్ ఇన్స్పెక్టర్ ముత్తు యాదవ్ తెలిపారు.