భార్య డెలివరీకి  డబ్బులు లేవని భర్త ఆత్మహత్య

V6 Velugu Posted on May 17, 2021


సిద్దిపేట రూరల్, వెలుగు: కరోనా ఎఫెక్ట్ తో ఉపాధి కరువై.. భార్య డెలివరీకి కూడా డబ్బులు లేకపోవడంతో ఓ భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. సిద్దిపేట టూ టౌన్​ సీఐ పరుశురాంగౌడ్​ తెలిపిన వివరాల ప్రకారం.. చందాపూర్​ గ్రామానికి చెందిన పడాడ ప్రశాంత్(25), నాగమణి భార్యాభర్తలు. కొన్నాళ్లుగా సిద్దిపేటలో ఉంటూ ఆటో నడుపుకుంటున్నాడు. కరోనా, లాక్​డౌన్​ఎఫెక్ట్​తో ఆటో నడవక, దాని ఈఎంఐలు కట్టడానికి, కుటుంబ పోషణకు డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నాడు. ఇటీవల తెచ్చిన అప్పులకు మిత్తీలు కట్టేందుకు బైక్​ను అమ్మేశాడు. దీనికితోడు భార్య డెలివరీ టైం దగ్గరపడడంతో వారం క్రితం ఆమెను టౌన్​లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో జాయిన్​ చేశాడు. ఆదివారం ఆమెను డిశ్చార్జి చేయాల్సి ఉంది.  చేతిలో పైసలు లేవనే బాధలో పత్తి మార్కెట్ దగ్గర లోని ఓ చెట్టుకు ఉరి వేసుకుని ప్రశాంత్​ ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రశాంత్​ తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Tagged HUSBAND, siddipet, money, suicide, wife delivery

Latest Videos

Subscribe Now

More News