పోటెత్తిన వరద: ప్రాణాలకు తెగించి భార్యను కాపాడిన భర్త

V6 Velugu Posted on Aug 17, 2021

మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం దొరవారితమ్మాపురం గ్రామానికి చెందిన మహిళ వాగు అవతల చిక్కుకోవటంతో.. ప్రాణాలకు తెగించి ఆమె భర్త కాపాడాడు. గ్రామానికి చెందిన సుభద్ర గత రాత్రి మొక్కజొన్న చేనులో కాపలాగా వెళ్లింది. తిరిగివచ్చే క్రమంలో వాగు ఉదృతి పెరిగింది. దీంతో ఆమె భర్త విజయ్ వాగు ఇవతల చెట్టుకు తాడు కట్టి ఈదుతూ అవతలి ఒడ్డుకు చేరుకున్నాడు. తాడు సాయంతో భార్యా భర్తలిద్దరూ ఇవతలి ఒడ్డుకు చేరుకున్నారు. సాహసంతో భార్యను కాపాడుకున్న భర్త విజయ్ ను గ్రామస్థులు అభినందించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వాగుపై బ్రిడ్జిని నిర్మించాలని కోరుతున్నారు.
 

 

Tagged river, Mahabubabad District, Husband rescue, wife trappe

Latest Videos

Subscribe Now

More News