కరోనా కర్ఫ్యూ: భార్యను కలిసేందుకు దొరకని ఈ – పాస్.. ఆత్మహత్య చేసుకున్నభర్త

కరోనా కర్ఫ్యూ: భార్యను కలిసేందుకు దొరకని ఈ – పాస్.. ఆత్మహత్య చేసుకున్నభర్త

కరోనా కర్ఫ్యూతో బార్యను కలిసేందుకు ఈ పాస్ రాలేదని మనో వేదనకు గురైన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. తమిళనాడు కాంచిపురానికి చెందిన విఘ్నేశ్వరన్ కు చెన్నై తాంబరం కు చెందిన రాగినితో గత ఏడాది జూన్ 20న వివాహం అయ్యింది. ఇద్దరూ కాంచిపూరంలో నివాసం ఉంటున్నారు. అయితే భార్య రాగిని కడుపుతో ఉండడంతో లాక్ డౌన్ ముందు ఆమెను చెన్నై తాంబరంలోని అమ్మగారింటికి పంపాడు విఘ్నేశ్వరన్ . అయితే లాక్ డౌన్ తో భార్యను కలిసేందుకు ఈ పాస్ కోసం ప్రయత్నించినా రాకపోవడంతో యువకుడు మనస్థాపానికి గురయ్యాడు. కడుపుతో ఉన్న భార్యను కలవలేకపోయానన్న బాధతో కుమిలిపోయాడు. అంతే కాకుండా  ఇటీవల జూన్ 20 న తమ మొదటి పెళ్ళి రోజు అయినా కనీసం భార్యతో కలిసి జరుపుకోవాలని ఎంత ప్రయత్నం చేసినా ఈ పాస్ లభించలేదు.  తరచూ భార్య చూడాలనిపిస్తోందంటూ విఘ్నేశ్వరన్ కు ఫోన్ చేసేది. దీంతో మరింత కుమిలిపోయాడు విఘ్నేశ్వరన్. మనస్థాపంతో కాంచిపురంలోని తన ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే రాత్రి భార్య రాగినికి  పురిటి నొప్పులతో ఆసుపత్రిలో చేర్పించారు తల్లిదండ్రులు. విషయం విగ్నేశ్వరన్ కు చెప్పేందుకు ఆమె తల్లింద్రులు ఎంతో ప్రయత్నించారు. ఫోన్ లిప్ట్ చేయకపోవడంతో విఘ్వేశర్వరన్ స్నేహితులకు సమాచారం అందించారు. రాగినిని ఆస్పత్రిలో చేర్పించారన్న విషయాన్ని విఘ్వేశ్వరన్ కు చెప్పేందుకు అతని స్నేహితులు ఇంటికి వెళ్లారు. అయితే అతని స్నేహితులు విఘ్వేశ్వర్ ను ఇంటి డోర్ ఎంత సేపు కొట్టినా ఓపెన్ చేయకపోవడంతో అనుమానం వచ్చి డోర్లు బలవంతంగా ఓపెన్ చేయగా బాధితుడు విఘ్వేశ్వరన్ ఉరికి వేలాడుతూ విగతజీవిగా కనిపించాడు.  ఒకవైపు పురిటి నొప్పులతో భార్య ఆసుపత్రిలో చేరగా, మరో వైపు భర్త ఆత్మహత్య చేసుకోవడంతో  ఇరు కుటుంబాల సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. విఘ్వేశ్వరన్ మృతిపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.