పేరుకే మాజీ ప్రధాని ఊరు.. ఏం డెవలప్‌‌‌‌‌‌‌‌ చేసిన్రు మీరు?

పేరుకే మాజీ ప్రధాని ఊరు.. ఏం డెవలప్‌‌‌‌‌‌‌‌ చేసిన్రు మీరు?

భీమదేవరపల్లి, వెలుగు: పీవీ శత జయంతి ముగింపు వేడుకల సందర్భంగా హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీశ్‌‌‌‌‌‌‌‌బాబుకు వంగర గ్రామస్తుల నిరసన సెగ తగిలింది. మాజీ ప్రధాని సొంతూరని చెప్పుకోవడానికే సరిపోతోందని, సర్కారు ప్రకటనలు తప్ప అభివృద్ధి ఏం కనిపించట్లేదని అన్నారు. వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలంలోనీ పీవీ సొంతూరు వంగరలో సోమవారం మధ్యాహ్నం ఉత్సవాలు నిర్వహించారు. సతీశ్‌‌‌‌‌‌‌‌బాబు ముఖ్య అతిథిగా హాజరై పీవీ సేవలను కొనియాడారు. గ్రామాన్ని అన్ని రకాలుగా డెవలప్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. అంతవరకూ ఓపిక పట్టిన గ్రామస్తులు సమావేశం తర్వాత ఎమ్మెల్యే తిరిగి వెళ్తుండగా అడ్డం తిరిగారు. వంగరలో డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్ ఎక్కడుందని ప్రశ్నించారు. తమతో పాటు ఊర్లోకి వస్తే సమస్యలేంటో చూపిస్తామని చెప్పారు. దీంతో గ్రామస్తులను సతీశ్‌‌‌‌‌‌‌‌బాబు సముదాయించే ప్రయత్నం చేశారు. గ్రామాభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని, ఊరి డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌కు ఎన్ని నిధులు కావాలన్నా వెంటనే మంజూరు చేస్తామని చెప్పి వెనుదిరిగారు.