హుస్నాబాద్ లో మోడ్రన్ ఫిష్ మార్కెట్ .. కూలింగ్ మిల్క్ సెంటర్.. ఏర్పాటుకు హామీ..మంత్రి వాకిటి శ్రీహరి

హుస్నాబాద్ లో మోడ్రన్ ఫిష్ మార్కెట్ ..  కూలింగ్ మిల్క్ సెంటర్.. ఏర్పాటుకు హామీ..మంత్రి వాకిటి శ్రీహరి

హుస్నాబాద్, వెలుగు: హుస్నాబాద్​లో మోడ్రన్ ఫిష్ మార్కెట్, కూలింగ్ మిల్క్ సెంటర్​ ఏర్పాటు చేస్తామని మంత్రి వాకిటి శ్రీహరి ప్రకటించారు. శనివారం హుస్నాబాద్ పట్టణంలోని ఎల్లమ్మ చెరువులో మంత్రి పొన్నం ప్రభాకర్, ఫిషరీస్ డెవలప్​మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్​తో కలిసి చేప పిల్లలను వదిలారు. 

ఈ సందర్భంగా మంత్రి శ్రీహరి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఈ సీజన్​లో 84 కోట్ల చేపపిల్లలు, 10 కోట్ల రొయ్యపిల్లలు విడుదల చేయనున్నట్లు తెలిపారు. చేపపిల్లల పంపిణీలో పారదర్శకత కోసం ప్రతీ చెరువు వద్ద సైన్​ బోర్డుల ద్వారా పిల్లల రకం, సంఖ్య వివరాలు వెల్లడించే విధానాన్ని అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్​ మాట్లాడుతూ.. గురుకులాల మెనూలో చికెన్, మటన్​తో పాటు చేపలను ప్రవేశపెడతామని చెప్పారు. కలెక్టర్ హైమావతి, జిల్లా లైబ్రరీ చైర్మన్ లింగమూర్తి, మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతి రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ శివయ్య పాల్గొన్నారు.