హుస్సేన్ సాగర్ లోకి భారీగా వరద నీరు.. లెవల్ కి మించి నీటిమట్టం

హుస్సేన్ సాగర్ లోకి భారీగా వరద నీరు.. లెవల్ కి మించి నీటిమట్టం

హుస్సేన్ సాగర్ లోకి వస్తున్న వరద పరిస్థితిని జీహెచ్ఎంసీ లేక్స్ విభాగం 24 గంటలుగా పరిశీలిస్తుంది. గత రెండు రోజుల నుంచి నగరంలో ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షంతో హుస్సెన్ సాగర్ నిండు కుండలా మారింది. హుస్సేన్ సాగర్ ఎఫ్ టిఎల్ లెవెల్ 513.41 మీటర్లు కాగా.. ప్రస్తుతం నీటిమట్టం 513.64 మీటర్లకు చేరింది. హుస్సేన్ సాగర్ లో చేరిన వరద నీరు ఎప్పటికప్పుడు బయటకు వెళ్ళేలా రెండు అలుగులు మరియు ఒక తూమును ఓపెన్ చేశారు. అలుగులు, తూముకు అడ్డుపడుతున్న చెత్తాచెదారాన్ని క్లిన్ టెక్ మిషన్ మరియు సిబ్బందితో ఎప్పటికప్పుడు తొలగిస్తున్నారు. నగరవ్యాప్తంగా నిరంతరం పనిచేస్తున్న మాన్సూన్ ఎమర్జెన్సీ, డీఆర్ఎఫ్ బృందాలు, మరియు అధికారులను జీహెచ్ఎంసీ అప్రమత్తం చేసింది.

For More News..

మున్నేరువాగును పరిశీలించిన మంత్రి పువ్వాడ అజయ్

చెరుకుతోటలో 13 ఏళ్ల బాలికపై రేప్

రిటైర్ మెంట్ పై ధోని భార్య హార్ట్ ఫెల్ట్ పోస్ట్