హుజూర్‌నగర్‌లో బీఆర్ఎస్కు బిగ్ షాక్

హుజూర్‌నగర్‌లో బీఆర్ఎస్కు బిగ్ షాక్

హుజూర్‌నగర్‌లో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది.  హుజూర్‌నగర్‌ మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ అర్చన బీఆర్ఎస్ కు  రాజీనామా చేశారు. ఆమెతోపాటు ముగ్గురు కౌన్సిలర్లు (గాయత్రి భాస్కర్, అమరబోయిన సతీష్, గుంజ భవాని) కూడా రాజీనామా చేశారు. వీరంతా ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి ఉత్తమ్ పార్టీలోకి ఆహ్వానించారు.   కాంగ్రెస్ పార్టీలో చేరిన వీరికి పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి భరోసా ఇచ్చారు.