
సూర్యాపేట: సీఎంఆర్ఎఫ్ చెక్కులు లబ్దిదా రులకు చేరకుండా అక్రమాలకు పాల్పడిన ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల్లో మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి పీఏ ఓంకార్ ఉన్నారు. నిందితుల నుంచి రూ.7.30 లక్షల నగదుతో పాటు 44 చెక్కులు, 6 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నా రు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఎస్పీ కె.నరసింహా మీడియాకు వెల్లడించారు.
ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. " మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి పీఏ ఓంకార్ ఈ అక్రమాలకు పాల్పడ్డారు. బాధితులకు ఇవ్వా ల్సిన చెక్కులను నకిలీ వ్యక్తుల అకౌంట్లోకి జమ చేశారు. ఒకే ఇంటి పేరు ఉన్న నకిలీ వ్యక్తులను గుర్తించి రూ.9.50 లక్షల విలువైన 7 చెక్కులను బాధితులకు ఇవ్వకుండా మోసానికి పాల్పడ్డారు. మరో రూ.25.08 లక్షల విలువైన 44 చెక్కులు డ్రా చేసేందుకు సిద్ధమయ్యారు. నిందితుల నుంచి మొత్తం రూ. 34 లక్షల 58 వేల 400 విలువ గల 51 చెక్కులు స్వాధీనం చేసుకున్నారు.
►ALSO READ | జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు 407 పోలింగ్ స్టేషన్లు.. రూ.6 కోట్ల ఖర్చు: ఆర్వీ కర్ణన్