హుజూర్ నగర్ కు కేసీఆర్ వరాలు

హుజూర్ నగర్ కు కేసీఆర్ వరాలు

హుజూర్ నగర్ కు సీఎం కేసీఆర్ వరాలు కురిపించారు. శనివారం హుజూర్ నగర్ సభలో మాట్లాడిన సీఎం..భారీ మెజార్టీ ఇచ్చిన నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.  ఇది మామూలు విజయం కాదని..అపనిందనలు, సవాల్ తో కూడిన ఈ విజయం మాలో ఉత్సాహాన్ని ఇచ్చిందన్నారు. ఈ సందర్భంగా హుజూర్ నగర్ కు రూ.25 కోట్లు ప్రత్యేక నిధులు ఇస్తానన్న సీఎం..  ప్రతి పంచాయతీకి రూ.20 లక్షలు కేటాయిస్తామన్నారు.

గిరిజన బిడ్డల కోసం లంబాడి తండాలు, గూడెంలు గ్రామ పంచాయతీలుగా మార్చామని..గిరిజన బిడ్డల కోసం రెసిడెన్షియల్ స్కూల్, బంజారా భవన్ కూడా నిర్మిస్తామన్నారు. పోడు భూముల సమస్యను పరిష్కరిస్తామన్న ఆయన.. ప్రజా దర్బార్ పెట్టి భూముల సమస్యను తీరుస్తామని చెప్పారు. ఈ ప్రాంతంలో సిమెంట్ ఫ్యాక్టరీలు ఎక్కువగా  ఉన్నాయని..ప్రజల కోరిక మేరకు ESI హస్పిటల్ ను మంజూర్ చేస్తామన్నారు. అలాగే హుజూర్ నగర్ లో కోర్టు, పాలిటెక్నిక్ కాలేజీ, రెవిన్యూ డివిజన్ వెంటనే మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు సీఎం. అర్హులకు డబుల్ బెడ్ రూమ్స్ కట్టిస్తానన్నారు.

ఎలక్షన్ సమయంలో ప్రతిపక్షాల నేతలు దుర్మార్గంగా మాట్లాడారని..జగదీశ్ రెడ్డిని నీచంగా వర్ణించారన్నారు. అయినా ప్రజలు సరైనా తీర్చు చెప్పి, ప్రతిపక్షాలకు వాతపెట్టారని తెలిపారు. కాంగ్రెస్ నాయకులు ప్రజలకు అవసరం వచ్చే పనులను అడ్డుకోవాలని చూశారని.. నీటి పంపకాలలో సరియైన వాటా రాలేదన్నారు. రూ. 30వేల కోట్లతో యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ తో జిల్లా ముఖచిత్రమే మారిపోతుందన్నారు. దీన్ని కూడా కాంగ్రెస్ నాయకులు వ్యతిరేఖించారని..మహా నాయకులు వారితో తాను మాట్లాడదలుచుకోలేదన్నారు. హుజూర్ నగర్ లో 1997లో ఏ సమస్యలున్నాయో..అవే సమస్యలు ఇప్పుడూ ఉన్నాయన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక పరిష్కార దిశగా అడుగులు వేస్తోందని తెలిపారు. తెలంగాణలో ఎక్కడ నీళ్లు రాకున్నా ఆ బాధ నాదే అన్నారు సీఎం. ప్రతి ఏడాది 2 పంటలు పండేలా ప్లాన్ చేస్తున్నాం. 20 రోజుల్లో నాగార్జున సాగర్ లో పర్యటిస్తా. అధికారులతో, నాయకులతో కలిసి నాగార్జున సాగర్ ఆయకట్టు తిరుగుతా. లిఫ్టులు,కాలువల మరమ్మతులు చేస్తామన్నారు.

జిల్లా మంత్రి జగదీశ్ రెడ్డి శాసన సభ్యులతో విస్తృతంగా తిరగాలని.. లిఫ్ట్ ల బాధ్యతలు అవసరమైతే స్వచ్చంద సంస్థలకు అప్పగిస్తాం ..పనిచేసే వారికి ప్రతిరుపాయి ప్రభుత్వం ఇస్తుందన్నారు. ఎమ్మెల్యే సైధిరెడ్డి కోరిక మేరకు హుజూర్ నగర్ కు రింగురోడ్డు, ట్యాంక్ బండ్ మంజూర్ చేస్తానని తెలిపారు సీఎం కేసీఆర్. కేసీఆర్ ధన్యవాదాలు చెప్పడానికే హుజూర్ నగర్ కు రాలేదని … ఇక్కడ ఉన్న సమస్యలను పరిష్కారం కోసం పనిచేద్దామని తెలిపారు ముఖ్యమంత్రి.