
హైదరాబాద్, వెలుగు: హైబిజ్, టీవీ ఫుడ్ అవార్డ్స్ నాలుగో ఎడిషన్ను హైదరాబాద్లో నిర్వహించింది. తెలంగాణ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ సంస్కృతిని, పర్యాటకాన్ని ప్రపంచానికి తెలియజేయడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని ఆయన అన్నారు.
ఈ వేడుకలో ఫుడ్ ఇండస్ట్రీ నుంచి 50 మందికి పైగా అవార్డులు అందుకున్నారు. ఓహ్రీస్ సంస్థ నుంచి రవికుమార్, వివాహ భోజనంబు నుంచి వెంకట రామరాజు, సింప్లీ సౌత్ నుంచి షెఫ్ చలపతి రావులకు లెజెండ్ పురస్కారాలు లభించాయి. హైబిజ్ టీవీ ఎండీ ఎం. రాజ్ గోపాల్, తెలుగు నౌ ఎల్‌ఎల్‌పీ ఎండీ డాక్టర్ జె. సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు.