ప్రపంచ రికార్డ్ : హైదరాబాద్ ఎయిర్ పోర్ట్.. టైం అంటే టైం

ప్రపంచ రికార్డ్ : హైదరాబాద్ ఎయిర్ పోర్ట్.. టైం అంటే టైం

ప్రపంచంలోనే అత్యంత సమయపాలన పాటించే విమానాశ్రయాల జాబితాలో హైదరాబాద్ విమానాశ్రయం చోటు దక్కించుకుంది. ఈ జాబితాలో బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం అగ్రస్థానంలో ఉంది.

ఏవియేషన్ అనలిటిక్స్ సంస్థ సిరియం ఆన్-టైమ్ పనితీరు నివేదిక ప్రకారం, మొదటి ఐదు స్థానాల్లో ఉన్న ఇతర విమానాశ్రయాలు.. ఉటా (యూఎస్) లోని సాల్ట్ లేక్ సిటీ అంతర్జాతీయ విమానాశ్రయం రెండవ స్థానంలో ఉండగా, హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం మూడవ స్థానంలో, మిన్నియాపాలిస్- St. పాల్ అంతర్జాతీయ విమానాశ్రయం నాల్గవ స్థానంలో, ఎల్ డొరాడో అంతర్జాతీయ విమానాశ్రయం ఐదవ స్థానంలో ఉన్నాయి.

"బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రయాణీకులకు సమయానుకూలంగా బయలుదేరే అనుభవాన్ని కలిగి ఉంది. జూలైలో 87.51%, ఆగస్టులో 89.66%, సెప్టెంబర్‌లో 88.51% సమయపాలనను కలిగి ఉంది" అని బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (BIAL)

Also Read :- తుపాకులు ఇచ్చేయటానికి భారీ క్యూలు

ప్రపంచంలో అత్యంత సమయపాలన పాటించే విమానాశ్రయాల జాబితా :

  •     కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం, బెంగళూరు, భారతదేశం
  •     సాల్ట్ లేక్ సిటీ అంతర్జాతీయ విమానాశ్రయం, ఉటా, యూఎస్
  •     రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, హైదరాబాద్, భారతదేశం
  •     మిన్నియాపాలిస్-సెయింట్. పాల్ అంతర్జాతీయ విమానాశ్రయం, మిన్నెసోటా, యూఎస్
  •     ఎల్ డొరాడో అంతర్జాతీయ విమానాశ్రయం, బొగోటా, కొలంబియా
  •     ఓస్లో విమానాశ్రయం గార్డెర్మోన్, నార్వే
  •     డెట్రాయిట్ మెట్రోపాలిటన్ వేన్ కౌంటీ విమానాశ్రయం, యూఎస్
  •     హార్ట్స్‌ఫీల్డ్-జాక్సన్ అట్లాంటా అంతర్జాతీయ విమానాశ్రయం, యూఎస్
  •     హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం, దోహా, ఖతార్
  •     సీటెల్-టాకోమా అంతర్జాతీయ విమానాశ్రయం, యూఎస్

 
ఇవి షెడ్యూల్ చేసిన సమయానికి 15 నిమిషాలలోపు బయలుదేరిన విమానాల శాతం ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా విమానాశ్రయ సమయపాలనను సూచిస్తుందని సీరియం నివేదికలో తెలిపింది.