సికింద్రాబాద్, వెలుగు: బ్యాటింగ్‌లో రాణించిన హైదరాబాద్, పంజాబ్ జట్లు... రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్–బి మ్యాచ్‌ను డ్రాగా ముగించాయి. 57/0 ఓవర్‌నైట్ స్కోరుతో గురువారం నాలుగో రోజు ఆట కొనసాగించిన పంజాబ్ రెండో ఇన్నింగ్స్‌ను 78 ఓవర్లలో 240/6 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. విహాన్ మల్హోత్రా (53), ప్రభ్‌సిమ్రన్ సింగ్ (68), ఉదయ్ శరణ్ (55 నాటౌట్) హాఫ్ సెంచరీలు సాధించారు. తనయ్ త్యాగరాజన్, రక్షణ్ రెడ్డి చెరో రెండు వికెట్లు తీశారు. అయితే తొలి ఇన్నింగ్స్ (431) ఆధిక్యం కారణంగా పంజాబ్‌కు 3 పాయింట్లు లభించగా, హైదరాబాద్ ఖాతాలో ఒక్క పాయింట్ చేరింది. సలీల్ అరోరాకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
