హైదరాబాద్ లో ఆగస్టు 14న ఆటోల బంద్ : ఆటో డ్రైవర్స్ జేఏసీ

హైదరాబాద్ లో ఆగస్టు 14న ఆటోల బంద్ : ఆటో డ్రైవర్స్ జేఏసీ

 బషీర్​బాగ్, వెలుగు : ఆటోల బ్లాక్ మార్కెటింగ్ ను నిరోధించాలని ఆగస్టు 14న హైదరాబాద్ నగరంలో ఒక రోజు ఆటోల బంద్ నిర్వహిస్తున్నట్లు తెలంగాణ ఆటో డ్రైవర్స్ జేఏసీ ప్రకటించింది. శుక్రవారం హైదర్ గూడ ఎన్ఎస్ఎస్ లో జేఏసీ కన్వీనర్ అమానుల్లాఖాన్ మాట్లాడుతూ.. షోరూమ్ డీలర్లు ఫైనాన్షియర్లతో కుమ్మక్కై ఆటోలను బ్లాక్ లో ఎక్కువ ధరలకు అమ్ముతున్నారని ఆరోపించారు. 

బయటి జిల్లాల ఆటోలు సిటీలో తిరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. టూ వీలర్ ట్యాక్సీలను బెంగళూరు మాదిరిగా హైదరాబాద్ లో కూడా నిషేధించాలని, ఆటో మీటర్​చార్జీలు పెంచాలని కోరారు. ఆటో బ్లాక్ మార్కెటింగ్ కు పాల్పడుతున్న వారిపై పీడీ యాక్టు పెట్టి జైలుకు పంపించాలని డిమాండ్​ చేశారు.