రేప్యూర్‌‌ ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఈడీ లైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో వైరస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ఖతం

రేప్యూర్‌‌ ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఈడీ లైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో వైరస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ఖతం
  • లెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి రేప్యూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: కరోనా సహా పలు వైరస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను తొలగించగల యూవీ ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఈడీ లైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ‘రేప్యూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ను హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కంపెనీ చిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇండస్ ప్రైవేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లిమిటెడ్ అందుబాటులోకి తెచ్చింది.   సీసీఎంబీ సహా పలు ల్యాబ్స్​లో  జరిపిన టెస్టుల్లో ఇది పాసైందని కంపెనీ  ప్రకటించింది.    కరోనా వైరస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎఫెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 60 నిమిషాల్లో తగ్గిపోయినట్టు గమనించామని ప్రకటించింది. ఇండస్ ఎండీ విజయ్ గుప్తా మాట్లాడుతూ  రేప్యూర్ లైట్ కాంతిని ఇస్తూ గంటలోపే 60-–80 శాతం బ్యాక్టీరియాలను, వైరస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను తొలగిస్తుందని అన్నారు.  దీనికి నిర్వహణకు  ఖర్చు ఉండదన్నారు.  మాల్స్, హోటల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మెట్రో కోచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, ఆఫీసులు వంటి ప్రదేశాల కోసం దీనిని ప్రత్యేకంగా తయారు చేశామన్నారు.