అసదుద్దీన్​పై ఈసీకి మాధవీలత ఫిర్యాదు

అసదుద్దీన్​పై ఈసీకి మాధవీలత ఫిర్యాదు

హైదరాబాద్, వెలుగు: ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ మతపరమైన కామెంట్లు చేశారంటూ హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత ఈసీకి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సోమవారం ఆమె సీఈవో వికాస్ రాజ్‌‌ను కలిశారు. తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. అసదుద్దీన్ మతాల మధ్య చిచ్చుపెట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. బీఫ్ జిందాబాద్ అంటూ హిందువులను రెచ్చగొడుతున్నారని ఫైర్ అయ్యారు. ఈ విషయంలో పోలీసుల తీరుపై కూడా తమకు అనుమానాలున్నాయన్నారు.  మాంసాన్ని కొయ్యాలని, బీఫ్ జిందాబాద్ ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఉద్దేశపూర్వకంగా మతాల మధ్య ఘర్షణ కలిగించే కామెంట్లు చేస్తున్నారని చెప్పారు. తాను మసీద్ పై బాణం వేయలేదని..  ఆ టైమ్ లో కెమెరాను తిప్పడంతో అలా కనిపించిందన్నారు. కనీస విచారణ చేయకుండా పోలీసులు కేసు నమోదు చేశారన్నారు.