బుక్ ఫెయిర్ కిటకిట..సండే కావడంతో తరలివచ్చిన పుస్తక ప్రియులు

బుక్ ఫెయిర్ కిటకిట..సండే కావడంతో తరలివచ్చిన పుస్తక ప్రియులు

హైదరాబాద్​ బుక్​ ఫెయిర్​ పుస్తక ప్రియులతో కిటకిటలాడింది. ఆదివారం సెలవు కావడంతో తండోపతండాలుగా తరలివచ్చారు. పిల్లలు, మహిళలు, యువతులు , పెద్దలు ఇలా అన్ని వర్గాల వారు తమకు నచ్చిన పుస్తకాలను కొనుగోలు చేశారు. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఏ స్టాల్​చూసినా కిక్కిరిసిపోయి కనిపించింది. పుస్తకాలతో ఏర్పాటు చేసిన సెల్ఫీ పాయింట్​ వద్ద పలువురు ఫొటోలు దిగుతూ సందడి చేశారు.  

NTR స్టేడియంలో 38వ హైదరాబాద్ బుక్ ఫెయిర్ ను  మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించిన సంగతి తెలిసిందే.  పది రోజుల పాటు బుక్ ఫెయిర్ కార్యక్రమం కొనసాగనుంది. 17 రాష్ట్రాలకు చెందిన 13 భాషల పుస్తకాలు రీడర్స్ కోసం అందుబాటులోకి తెచ్చారు. మొత్తం368 స్టాల్స్ లో బుక్స్ ను ఏర్పాటు చేశారు.బుక్ ఫెయిర్ మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి 9 గంటల వరకు పాఠకుల సందర్శన కోసం అందుబాటులో ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. 

 ఫొటోగ్రాఫర్స్​, వెలుగు