బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ పైనుంచి పల్టీకొట్టిన కారు

బయోడైవర్సిటీ  ఫ్లైఓవర్ పైనుంచి పల్టీకొట్టిన కారు
  • కింద వెళ్తున్న మరో కారుపై పడ్డ కారు
  • ఆటో కోసం ఎదురుచూస్తున్న మహిళ  అక్కడికక్కడే మృతి
  • 8 మందికి తీవ్ర గాయాలు.
  • ఓవర్ స్పీడ్ వల్లే ప్రమాదం, భారీగా ట్రాఫిక్ జామ్

హైదరాబాద్:  నగరంలోని బయో డైవర్సిటీ ఫ్లై ఓవర్ పై ఘోర ప్రమాదం జరిగింది. ఫ్లై ఓవర్  పై నుంచి ఓ కారు (TS09 EW 5659)అదుపు తప్పి కింద వెళుతున్న మరో కారు మీద పడింది.  అక్కడే ఆటో కోసం ఎదురు చూస్తున్న కొందరు వ్యక్తులపై  పడడంతో ఓ మహిళ అక్కడికక్కడే మరణించగా మరో 8 మంది తీవ్ర గాయాలయ్యాయి . ఓవర్ స్పీడ్ తో  వెళుతున్న కారు అదుపు తప్పి ఫ్లై ఓవర్ పై నుంచి  పల్టీలు కొడుతూ కిందపడింది. ఈ ప్రమాదంలో కారు తునాతునకలైంది. దీంతో ఫ్లై ఓవర్ దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

వారం రోజుల క్రితం ఇదే ఫ్లై ఓవర్ పై ఓ బైక్ యాక్సిడెంట్ జరిగింది. ఈ ప్రమాదంలో బైక్ పై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు.

Hyderabad :Car accident on biodiversity flyover, Woman killed