కారులో మరో మహిళతో భార్యకు దొరికిన సీఐ

కారులో మరో మహిళతో భార్యకు దొరికిన సీఐ

మాజీ సీఐ నాగేశ్వరరావు ఘటన మరవక ముందే మరో సీఐ నిర్వాకం బట్టబయలైంది. వనస్థలిపురం పీఎస్ పరిధిలో వేరే మహిళతో కారులో ఏకాంతంగా ఉన్న సీసీఎస్ సీఐ రాజును ఆయన భార్య రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. ఘటనాస్థలికి వెళ్లిన కానిస్టేబుల్పై సీఐ దాడి చేశారు. 

కానిస్టేబుల్ ఫిర్యాదుతో సీఐ రాజును వనస్థలిపురం పోలీసులు అరెస్ట్ చేశారు. 353, 332,427 సెక్షన్ల కింద అతడిపై కేసు నమోదు చేశారు. 2002 బ్యాచ్కు చెందిన రాజు హైదరాబాద్ సీసీఎస్ విభాగంలో పనిచేస్తున్నారు.