సీసీటీవీ ఫుటేజ్ : 2 గంటల్లో మొత్తం ఇళ్లు మునిగాయ్

సీసీటీవీ ఫుటేజ్ : 2 గంటల్లో మొత్తం ఇళ్లు మునిగాయ్

హైదరాబాద్ లో భారీ వర్షాల వల్ల జరిగిన అనార్ధాలు కళ్లకు కట్టినట్లు ఇంకా కళ్లముందు కనిపిస్తున్నాయి. ఈ విషాదం నుంచి ఇప్పుడిప్పుడే నగర వాసులు బయటపడుతున్నారు. అయితే తాజాగా అక్టోబర్ 18 గత శనివారం తెల్లవారు జాము ఉదయం 3గంటల సమయంలో పడిన భారీ వర్షాల వల్ల చాంద్రాయణ గుట్టలో అన్నీ కాలనీలు నీటమునిగాయి. సుమారు 10వేల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఏకదాటిగా రెండుగంటల పాటు వరదనీరు ఇంట్లోకి రావడంతో బిక్కు బిక్కు మంటూ ప్రాణాల్ని అరచేతిలో పెట్టుకొని బ్రతుకు జీవుడా అంటూ గడిపారు. హఫీజ్ బాబా నగర్, ఒమర్ కాలనీ, ఫూల్ బాగ్, ఇండియా నగర్, రాజీవ్ నగర్, శివాజీ నగ్రాలలోని ఇళ్లు పూర్తిగా నీట మునిగాయి. అందుకు సజీవ సాక్ష్యంగా ఉన్న సీసీటీవీ పుటేజ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.