
భైంసా, వెలుగు: చదువుతోనే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని, పేద విద్యార్థులకు ప్రతి ఒక్కరూ తోడ్పాటు అందించాలని ఎమ్మెల్యే రామారావ్ పటేల్ అన్నారు. బుధవారం భైంసా మండలం తిమ్మాపూర్ లోని ప్రభుత్వ స్కూల్లో చదువుతున్న 95 మంది విద్యార్థులకు బీజేపీ మండల నేత పండిత్ రావ్ పటేల్ స్కూల్ షూస్ పంపిణీ చేశారు.
కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సమాజ సేవలో యువత భాగస్వాములు కావాలన్నారు. స్కూళ్ల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ఎంఈవో సుభాష్, టీచర్లు, నేతలు పాల్గొన్నారు
రిటైర్డ్ సైనికులకు సన్మానం
దేశ రక్షణలో సైనికుల సేవలు వెలకట్టలేనివని ఎమ్మెల్యే అన్నారు.స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం భైంసాలోని ఎస్ఎస్ జిన్నింగ్ ఫ్యాక్టరీలో రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగులు ఆకుల గోపాల్, సిలారం సంతోష్, కేసరి, ఎనపోతుల మల్లేశ్, నేరల్ వార్ సంతోష్ ను సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశ స్వాతంత్ర్యం కోసం ఎందరో మహనీయులు పోరాడారని, వారి సేవలను ప్రజలు ఏనాడూ మర్చిపోరని అన్నారు.
స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు సాంవ్లీ రమేశ్, సొలంకి భీంరావ్, బీజేపీ పట్టణ, మండల అధ్యక్షుడు రావుల రాము, సిరం సుష్మారెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ తోట లింగురాం, పండిత్ రావ్, సుభాష్, అశోక్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు