వృద్ధులు,దివ్యాంగుల సమస్యలు పరిష్కరించాలి : కలెక్టర్ విజయేందిర బోయి

వృద్ధులు,దివ్యాంగుల సమస్యలు పరిష్కరించాలి : కలెక్టర్  విజయేందిర బోయి

మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: వృద్ధులు, దివ్యాంగుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్  విజయేందిర బోయి ఆదేశించారు. స్థానిక అర్బన్  తహసీల్దార్  ఆఫీస్​లో బుధవారం నిర్వహించిన వృద్ధులు, దివ్యాంగుల ప్రత్యేక ప్రజావాణిలో కలెక్టర్  పాల్గొని అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వృద్ధులు, దివ్యాంగుల అర్జీలపై స్పెషల్  ఫోకస్  పెట్టాలని ఆదేశించారు. డీడబ్ల్యూవో జరీనా బేగం, డీఎంహెచ్​వో కె. కృష్ణ, డీఆర్డీవో శారద, హౌసింగ్​ పీడీ వైద్యం భాస్కర్, అర్బన్  సీనియర్  సిటిజన్  ఫోరం సభ్యులు పాల్గొన్నారు.

డ్రగ్స్ కు దూరంగా ఉండాలి

స్టూడెంట్లు డ్రగ్స్ కు దూరంగా ఉండాలని కలెక్టర్  విజయేందిర బోయి సూచించారు. నగరంలోని ఎంవీఎస్  కాలేజీలో నషా ముక్త్  భారత్  అభియాన్  నిర్వహించారు. స్టూడెంట్లతో డ్రగ్స్  నిరోధక ప్రతిజ్ఞ చేయించారు. డ్రగ్స్ కు విద్యార్థులు బానిస కావద్దని సూచించారు. డీడబ్ల్యూవో జరీనా బేగం, కాలేజీ ప్రిన్సిపాల్  కె. పద్మావతి పాల్గొన్నారు.