
బాలీవుడ్ నటులు సిద్ధార్థ్ మల్హోత్రా, జాన్వీ కపూర్ కలిసి నటించిన లేటెస్ట్ మూవీ "పరమ్ సుందరి". ఆగస్టు 29న ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఇవాళ (ఆగస్టు 14న) సిద్ధార్థ్, జాన్వీ కపూర్లు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
ఇవాళ ఉదయం నైవేద్య విరామ సమయంలో శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితుల వేద ఆశీర్వచనం అందించగా, పట్టు వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం.. అభిమానులు వీరితో సెల్ఫీలు దిగారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read: OTTలో దూసుకెళ్తున్న అనిల్ గీలా వెబ్ సిరీస్
పరమ్ సుందరి సినిమా విషయానికి వస్తే: నార్త్ ఇండియాకు చెందిన ‘పరం’ (సిద్ధార్థ్ మల్హోత్రా), దక్షిణాదికి చెందిన ‘సుందరి’ (జాన్వీ కపూర్) మధ్య జరిగే కథే ఈ పరమ సుందరి. అయితే, భాష, సంస్కృతులు, ఆచార వ్యవహారాలు విషయంలో భిన్న ధృవాలైన వీరి పెళ్లికి ఎలాంటి ఎలాంటి అవాంతరాలు ఎదురయ్యాయనేది వినోదభరితంగా తెరకెక్కించారు. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను అలరిస్తున్నాయి.