OTTలో దూసుకెళ్తున్న అనిల్ గీలా వెబ్ సిరీస్‌‌.. ‘మోతెవరి లవ్‌‌ స్టోరీ’ కథేంటంటే?

OTTలో దూసుకెళ్తున్న అనిల్ గీలా వెబ్ సిరీస్‌‌.. ‘మోతెవరి లవ్‌‌ స్టోరీ’ కథేంటంటే?

అనిల్ గీలా, వర్షిణి రెడ్డి జంటగా విలేజ్ బ్యాక్‌‌డ్రాప్‌‌లో రూపొందిన  వెబ్ సిరీస్ ‘మోతెవరి లవ్‌‌ స్టోరీ’.శివ కృష్ణ బుర్రా దర్శకుడు. మధుర శ్రీధర్, శ్రీరామ్ శ్రీకాంత్ కలిసి నిర్మించారు. ప్రస్తుతం జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్‌‌కు వస్తున్న రెస్పాన్స్‌‌ గురించి తెలియజేసేందుకు సక్సెస్‌‌ మీట్ నిర్వహించారు.

లీడ్ రోల్ చేసిన అనిల్ గీలా మాట్లాడుతూ ‘ఇది చూస్తే మన ఇంట్లో జరిగే కథలా అనిపిస్తుంది. ఆదరిస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్. మేం పడిన కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చింది. మేం ఇలానే కష్టపడుతూనే ఉంటాం. ఇలానే ఆడియెన్స్ మమ్మల్ని ఆదరించండి. ఈ సిరీస్‌‌ మీకు నచ్చితే ఓ ముగ్గురికి చెప్పి సపోర్ట్ చేయండి’అని అన్నాడు.

దర్శకుడు మాట్లాడుతూ ‘ఈ సిరీస్‌‌ను మా నాన్నకు అంకితం చేస్తున్నా. మావి గల్ఫ్ బతుకులు, గల్ఫ్ మెతుకులు. మా నాన్న నిజ జీవితం ఆధారంగా ఇందులోని కొన్ని సీన్స్‌‌ తీశా’ అని చెప్పాడు.

ఇది తెలంగాణ కథ అయినప్పటికీ అందరూ చూసేలా తెరకెక్కించామని నిర్మాత శ్రీరామ్ శ్రీకాంత్ చెప్పారు. హీరోయిన్ వర్షిణి, నటీనటులు మాన్సీ, సదన్న, మల్లారెడ్డి, లిరిక్ రైటర్ గంగాధర్, కెమెరామెన్ శ్రీకాంత్, కొరియోగ్రాఫర్ ప్రశాంత్, జీ5 కంటెంట్ హెడ్ దేశ్ రాజ్ సాయి తేజ్ పాల్గొన్నారు.

మోతెవరి లవ్ స్టోరీ కథేంటంటే?

ఈ సిరీస్ తెలంగాణలోని ఆరెపల్లి అనే గ్రామంలో మొదలవుతుంది. ఈ పల్లెటూర్లో సత్తయ్య, నార్సింగ్ ఇద్దరు అన్నదమ్ములుంటారు. వారే ఆ ఊరికి గ్రామ పెద్దలు. వారి నాన్నే మోతెవరి. అయితే, వాళ్ళ తండ్రి చనిపోయేముందు ఓ మహిళకు ఐదు ఎకరాల భూమి రాసిస్తాడు.

ఈ క్రమంలోనే ఆరెపల్లిలో రహస్యంగా ప్రేమించుకుంటున్న సత్తయ్య కుమార్తె అనిత (వర్షిణి రెడ్డి జున్నుతుల), అనుమవ్వ మనవడు పార్షి (అనిల్ జీలా) లేచిపోయి పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేస్తారు. అయితే అదే గ్రామంలో ఉండే ఆ ఇద్దరు అన్నదమ్ములకు వారసత్వంగా వచ్చిన భూమి కోసం తగాదా పడుతుంటారు. ఈ క్రమంలో పెళ్లి చేసుకోవాలని అనుకున్న లవ్ జంటకు అనుకోని అవాంతరాలు ఎదురవుతాయి.

హైదరాబాద్‌ సమీపంలో ఉన్న 5 గుంటల స్థలం అనుమవ్వకే చెందాలని మోతెవరి ఎందుకు రాయాల్సి వచ్చింది? వారసత్వంగా వచ్చిన భూమి కోసం ఈ అన్నదమ్ములు ఏం చేశారు? చివరికి పార్షి, అనిత ప్రేమ సక్సెస్ అయ్యిందా? అనేది తెలియాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే.