
- సిటీ సీపీ సీవీ ఆనంద్
బషీర్‌బాగ్, వెలుగు: నిజాం కాలంలో కొత్వాల్‌గా పనిచేసి సాంఘిక దురాచాలను రూపుమాపడంలో రాజా బహదూర్ వెంకటరామిరెడ్డి ఎంతో కృషి చేశారని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సి.వి.ఆనంద్ అన్నారు. శుక్రవారం ఆయన జయంతిని రాజా బహదూర్ ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షుడు టి.మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. సీవీ ఆనంద్ హాజరై నారాయణగూడ వైఎంసీఏ చౌరస్తాలోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
మహిళా విద్య, వితంతు పునర్వివాహానికి కృషి చేశారని గుర్తు చేశారు. ఆయన జయంతి సందర్భంగా ఎడ్యుకేషనల్ సొసైటీ తరఫున ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులను గోల్డ్ మెడల్, రూ.5 వేలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో సైబర్ క్రైం ఇన్‌స్పెక్టర్ కె.సతీశ్ రెడ్డి, ఎస్ఐ సురేశ్, షాద్‌నగర్ డీఐ ఎస్.వెంకటేశ్వర్లు, ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి ఐపీఎస్ పాల్గొన్నారు.