- హెడ్ మాస్టర్లతో కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
హైదరాబాద్ సిటీ, వెలుగు : సిటీలోని గవర్నమెంట్స్కూళ్లపై ప్రజలకు నమ్మకం పెంచేలా బోధన ఉండాలని హైదరాబాద్కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశించారు. విద్యా వ్యవస్థను మెరుగుపరచాలని సూచించారు. సోమవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్హాల్లో ‘కాఫీ విత్ కలెక్టర్’ కార్యక్రమం నిర్వహించారు. గతవారం స్టూడెంట్స్అటెండెన్స్ను 10 శాతం పెంచిన 10 స్కూళ్ల హెడ్మాస్టర్లతో కలిసి కాఫీ తాగారు. ఈ సందర్భంగా కలెక్టర్మాట్లాడుతూ..
నాంపల్లి సెక్షన్కాలనీ ఎన్ఆర్ఆర్పురం ప్రభుత్వ బాయ్స్ హైస్కూల్లో1,357 మంది విద్యార్థులకు గానూ 1,347 విద్యార్థులు క్లాసులకు హాజరవడం మంచి పరిణామం అని ప్రశంసించారు. మిగతా స్కూళ్లు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఖైరతాబాద్ స్కూల్హెచ్ఎం డాక్టర్ శాంతా రాథోడ్, లంగర్ హౌస్ హైస్కూల్ హెచ్ఎం ఉమారాణి, హుమాయున్ నగర్ హెచ్ఎం మహమ్మద్ ముజాహిద్ అలీ, నల్లకుంట హెచ్ఎం జి.సుజాత
ఎల్లారెడ్డి గూడ గూడ హెచ్ఎం పెర్సీ, నాంపల్లి సెక్షన్ కాలనీ ఎన్ఆర్ఆర్ పురం హెచ్ఎం కె.గీత, రసూల్ పురా పోలీస్ లైన్ స్కూల్హెచ్ఎం జి.రంగనాథ్, తిరుమలగిరి హెచ్ఎం కె.విష్ణు వర్ధన్ రెడ్డి, అంబర్ పేట జినాప బాగ్ హెచ్ఎం వందనాశర్మ, అమీర్ పేట హైస్కూల్ హెచ్ఎం ఎండీ అంజద్ అలీ ఖాతిబ్ పనితీరు బాగుందని మెచ్చుకున్నారు. పిల్లల హాజరుశాతం పెంచడంతోపాటు నాణ్యమైన విద్యా బోధన జరిగేలా చూడాలన్నారు. కార్యక్రమంలో డీఈఓ ఆర్.రోహిణి పాల్గొన్నారు.