హైదరాబాద్- ఇన్చార్జి కలెక్టర్గా మ‌‌ను చౌద‌‌రి

హైదరాబాద్- ఇన్చార్జి  కలెక్టర్గా మ‌‌ను చౌద‌‌రి
  • సిక్ లీవ్​లో కలెక్టర్ హరిచందన 

హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్ కలెక్టర్ హరిచందన దాసరి వారం రోజుల పాటు సిక్ లీవ్ పెట్టారు. అనారోగ్యానికి  గురి కావడంతో సెలవు పెట్టినట్లు తెలిసింది. శుక్రవారం ఆమె డాక్టర్లను సంప్రదించినట్లు, ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలిసింది. దీంతో వారం పాటు మేడ్చల్–మల్కాజిగిరి కలెక్టర్ మ‌‌ను చౌద‌‌రికి ఇన్​చార్జికి కలెక్టర్ గా ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది.