ఈ నెల 18 న బొండాడ ఐపీఓ ఓపెన్

ఈ నెల 18 న బొండాడ ఐపీఓ ఓపెన్

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ కంపెనీ బొండాడ ఇంజనీరింగ్ లిమిటెడ్ ఐపీఓ ఈ నెల 18 న ఓపెన్ అవుతుంది. 22 వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. బీఎస్ఈ ఎస్ఎంఈ సెగ్మెంట్ లో కంపెనీ ఐపీఓకి వస్తోంది. ఫ్రెష్ గా షేర్లను ఇష్యూ చేయడం ద్వారా రూ. 42.72 కోట్లను సేకరించాలని చూస్తోంది. ఈ పబ్లిక్ ఇష్యూ లో రూ. 10 ఫేస్ వాల్యూ ఉన్న  షేరును రూ. 75 వద్ద అమ్ముతున్నారు. ఇన్వెస్టర్లు కనీసం 1,600 షేర్ల కోసం బిడ్స్ వేసుకోవాలి. టెలికాం టవర్లు తయారు చేసే బొండాడ ఇంజనీరింగ్ కు 2022-–23 లో రూ.371 కోట్ల రెవెన్యూ వచ్చింది. 

రూ. 18.25 కోట్ల ప్రాఫిట్ సంపాదించింది. తమ ఆర్డర్ బుక్ వాల్యూ రూ. 1,520 కోట్లు అని, అప్పులు రూ. 80 కోట్లని కంపెనీ ఎండీ రాఘవేంద్ర అన్నారు. సోలార్, టెలికాం ఈపీసీ బిజినెస్ లో బోలెడు అవకాశాలు ఉన్నాయని, వచ్చే పదేళ్లలో 1-2 శాతం మార్కెట్ షేర్ పొందినా రెవెన్యూ భారీగా పెరుగుతుందని చెప్పారు. కాగా ఐపీఓ ద్వారా 26.5 శాతం వాటాను కంపెనీ అమ్ముతోంది. ఈ పబ్లిక్ ఇష్యూ పూర్తయ్యాక కంపెనీ వాల్యుయేషన్ రూ. 162 కోట్లుగా ఉంటుంది.