ఫెడెక్స్ కొరియర్ లో డ్రగ్స్ అంటూ చీటింగ్.. రూ.6 లక్షలు కొట్టేసిన కేటుగాడు

ఫెడెక్స్ కొరియర్ లో డ్రగ్స్ అంటూ చీటింగ్.. రూ.6 లక్షలు కొట్టేసిన కేటుగాడు

ఫెడెక్స్.. ఇంటర్నేషనల్ కొరియర్ సంస్థ.. హైదరాబాద్ సిటీ చాలా బ్రాంచీలు ఉన్నా.. ఇలాంటి మోసం ఒకటి జరుగుతుందని.. ఇలా కూడా మోసం చేయొచ్చని ఈ కేటుగాడు నిరూపించాడు. నిత్యం ఆన్ లైన్ ఉంటే హర్షకుమార్ అనే యూపీకి చెందిన ఈ కుర్రోడు.. హైదరాబాద్ సిటీకి చెందిన ఓ మహిళకు ఫోన్ చేశాడు. మీ పేరు, అడ్రస్ తో.. తైవాన్ దేశం నుంచి ముంబైకి డ్రగ్స్ పార్శిల్ వచ్చిందని.. మిమ్మల్ని ఎప్పుడైనా సరే పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉందంటూ భయపెట్టాడు. పోలీసులకు చిక్కితే.. మీరు జీవితాంతం జైలులో ఉంటారంటూ కాల్స్ చేసి చెప్పాడు. 

దీంతో భయపడిన ఆ మహిళ.. ఈ సమస్యను ఎలాగైనా పరిష్కరించాలని ఈ కేటుగాడిని కోరింది. ట్రాప్ లో పడ్డారని నిర్ణయించుకున్న హర్షకుమార్.. ఆరు లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని నమ్మించాడు. కేసులు, పోలీసులు, జైలు ఎందుకు అనుకున్న ఆ మహిళ.. ఈ హర్షకుమార్ కు ఆరు లక్షల రూపాయలు చెల్లించింది.. అతను చెప్పిన బ్యాంక్ అకౌంట్ నెంబరుకు డబ్బులు పంపించింది. 

కొన్ని రోజులకు మోసపోయినట్లు గుర్తించింది. ఆ వెంటనే సైబర్ క్రైం పోలీసులకు కంప్లయింట్ చేసింది ఆ మహిళ. విచారణ చేసిన పోలీసులు.. హర్షకుమార్ ను ట్రాక్ చేశారు. ఉత్తరప్రదేశ్ లోని అలీఘర్ లో ఉన్నట్లు గుర్తించి.. అక్కడికి వెళ్లి అరెస్ట్ చేశారు పోలీసులు. నిందితుడు హర్షకుమార్ నుంచి ల్యాప్ టాప్, ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వీడికి చైనాకు చెందిన హ్యాకర్లు, సైబర్ నేరగాళ్లతోనూ సంబంధాలు ఉన్నాయని వెల్లడించారు పోలీసులు. 

సైబర్ క్రైం ద్వారా దోచేసిన సొమ్మును క్రిప్టో కరెన్సీ అకౌంట్లకు ట్రాన్సఫర్ చేస్తు్న్నట్లు గుర్తించారు. గతంలోనూ చాలా మందిని చీట్ చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. విచారణ తర్వాత పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి. ఫెడెక్స్ కొరియర్ ద్వారానూ మోసం చేయొచ్చని వీడిని చూస్తేనే తెలుస్తుంది..