 
                                    నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల ప్రాముఖ్యత కీలకమన్నారు హైదరాబాద్ సీపీ అంజనీకుమార్. ఎన్నో కేసుల్లో సీసీ కెమెరాలు నిందితులను పట్టిస్తున్నాయని.. కెమెరాలు లేని చోటే నేరాలు జరుగుతున్నాయన్నారు. ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమన్న ఆయన .. నేర నియంత్రణకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. హైదరాబాద్ సేఫ్ సిటీ కావడంతోనే పెట్టుబడులు వస్తున్నాయన్నారు అంజనీకుమార్. నేరాల సంఖ్య తగ్గాలంటే ప్రతీ పౌరుడు ఓ పోలీస్ లాగా బాధ్యతగా వ్యవహరించాలన్నారు.

 
         
                     
                     
                    