ట్యాంక్ బండ్ పై గణేశ్ నిమజ్జనానికి వీల్లేదు

ట్యాంక్ బండ్ పై గణేశ్ నిమజ్జనానికి వీల్లేదు

గణేష్ నిమజ్జనం సందర్భంగా హైకోర్టు గత నెలలో ఇచ్చిన ఆదేశాలనే పాటిస్తమని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్  హైకోర్టుకు తెలిపారు. తాజా హైకోర్టు ఆదేశాలను అనుసరించి.. వినాయక విగ్రహాలను ట్యాంక్ బండ్ పై నిమజ్జనం చేయడానికి వీల్లేదన్నారు. కేవలం మట్టి వినాయకులను మాత్రమే ట్యాంక్ బండ్ కు అవతలి వైపు నిమజ్జనం చేయొచ్చని తెలిపారు. పీవీ ఘాట్ , ఎన్టీఆర్ ఘాట్, నెక్లెస్ రోడ్ వైపు కూడా నిమజ్జనం చేయొచ్చని వివరించారు.

ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను  బేబీ పాండ్స్ లోనే నిమజ్జనం చేయాలని చెప్పారు. ‘‘ప్రతి ఏడాది వినాయక నిమజ్జనం సమయం లో మార్గదర్శకాలను కోర్టు జారీ చేయాల్సి వస్తోంది. వచ్చే ఏడాది మార్చిలోగా నిమజ్జనంపై తెలంగాణ ప్రభుత్వం ఒక నిర్దేశిత ప్రణాళికను రూపొందించాలి’’ అని ఇటీవల హైకోర్టు వ్యాఖ్యానించిన విషయాన్ని సీపీ ఈసందర్భంగా గుర్తుచేశారు.