నిర్మానుష్యంగా డీఎల్‌ఎఫ్ స్ట్రీట్ .. సమయపాలనపై ఆంక్షలతో వ్యాపారంపై గట్టి దెబ్బ

నిర్మానుష్యంగా డీఎల్‌ఎఫ్ స్ట్రీట్ ..  సమయపాలనపై ఆంక్షలతో వ్యాపారంపై గట్టి దెబ్బ

 హైదరాబాదులోని నైట్ లైఫ్‌కి పేరుగాంచిన గచ్చిబౌలిలోని ప్రముఖ డిఎల్‌ఎఫ్ స్ట్రీట్ ఇప్పుడు అర్ధరాత్రి 12 గంటల తర్వాత నిర్మానుష్యంగా కనిపిస్తోంది. వాస్తవానికి, ఈ సమయంలో ఈ ప్రదేశంలో జనాలతో కోలాహలంగా కనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచే.. అంటే అక్టోబర్‌లో డీఎల్‌ఎఫ్, ఇతర వీధుల సమయాలపై ఆంక్షలు విధించారు. రాత్రి 11 గంటలకే అన్ని సంస్థలు మూసివేయాలని ఆదేశించారు.

ఎన్నికల ఫలితాలు వెలువడి నెల రోజులు గడుస్తున్నా ఇంకా ఈ ఆంక్షలు ఎత్తివేయలేదు. ప్రతి రాత్రి 11.45 గంటల ప్రాంతంలో, పోలీసు వ్యాన్‌లు తమ సైరన్‌లతో వీధిలోకి ప్రవేశించి.. దుకాణాన్ని మూసివేయమని విక్రేతలకు సంకేతాలు ఇచ్చేవి. ఇప్పుడు అర్ధరాత్రి తర్వాత, ఈ వీధి ఖాళీగా, నిశ్శబ్దంగా మారిపోయింది. ఈ విషయంపై స్పందించిన డీఎల్ఎఫ్ స్ట్రీట్‌లోని మోమోస్ డిలైట్ యజమాని.. ఈ టైమింగ్స్ వల్ల తాము చాలా నష్టపోతున్నామని, ఒకప్పుడు అర్థరాత్రి కూడా తమ దుకాణాలను తెరిచే ఉంచే వాళ్లమని.. కానీ ఇప్పుడు 12 గంటలకు మూసివేసి, ఉదయం 4 గంటలకు మళ్లీ తెరుస్తున్నామన్నారు.