
హైదరాబాద్: మ్యూల్ ఖాతాలతో 500కోట్ల ఫ్రాడ్ కేసులో సైబర్ క్రిమినల్ శరణ్ కుమార్‌ను హైదరాబాద్ సైబర్ క్రైమ్ బ్యూరో అరెస్ట్ చేసింది. ఈ కేసులో రెండు నెలల్లో SBI బ్యాంక్ ద్వారా రూ.500 కోట్ల పైగా నగదు లావాదేవీలు 234 సైబర్ లింకుల ద్వారా డబ్బులు మ్యూల్ ఖాతాలకు బదిలీ అయినట్లు గుర్తించారు.
సైబర్ క్రిమినల్ శరణ్ కుమార్‌ను హైదరాబాద్ సైబర్ క్రైమ్ బ్యూరో అరెస్ట్ చేసింది. ఈ కేసులో SBI బ్యాంక్ ద్వారా రెండు నెలల్లో రూ. 500 కోట్ల కంటే ఎక్కువ నగదు లావాదేవీలు జరిగాయి. సైబర్ నేరగాళ్లు అనేక మ్యూల్ ఖాతాలను ఉపయోగించారు.వాటిలో 500 కోట్ల పైచిలుకు నగదు బదిలీ చేశారు. 234 సైబర్ లింకుల ద్వారా డబ్బులు ఈ మ్యూల్ ఖాతాలకు వచ్చాయి.
ఆరు కంపెనీలకు శరణ్ కుమార్ మ్యూల్ ఖాతాలను ఏర్పాటు చేసినట్లు గుర్తించారు. దేశవ్యాప్తంగా ఉన్న సైబర్ క్రైమ్ నెట్‌వర్క్‌తో ఈ కేసు సంబంధం కలిగి ఉన్నట్లు హైదరాబాద్ సైబర్ క్రైమ్ బ్యూరో అధికారులు గుర్తించారు.
ఆన్‌లైన్ ట్రేడింగ్, ఇన్వెస్ట్ మెంట్ మోసాలకు పాల్పడే కేటుగాళ్లకు బ్యాంక్ ఖాతాలు సప్లయ్ చేస్తున్న నలుగురిని టీజీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆగస్టు 2న అరెస్ట్ చేసింది. నార్సింగికి చెందిన మనుబోతుల శ్రీనివాస్, నాంపల్లి ఆఘాపురకు చెందిన సయ్యద్ యూసుఫ్, బంజారాహిల్స్‌కు చెందిన చెక్క యేష్యా, హుమాయున్ నగర్‌కు చెందిన మహ్మద్ జుబేర్ అహ్మద్ ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించింది.
నిందితులు సైబర్ నేరగాళ్లకు మ్యూల్ బ్యాంక్ ఖాతాలు ఇవ్వడంతో పాటు సైబర్ మోసాల్లో కొల్లగొట్టిన నగదు లావాదేవీల్లో10 శాతం కమీషన్ తీసుకుంటున్నట్లు తేలింది.