లైక్స్ చేస్తే ,రివ్యూలు రాస్తే డబ్బులా?..మోసపోకండి

లైక్స్ చేస్తే ,రివ్యూలు రాస్తే డబ్బులా?..మోసపోకండి

సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఆన్ లైన్ పార్ట్ టైమ్ జాబ్స్, భారీ ఆఫర్ల పేరుతో దొరికిన కాడికిదోచుకుంటున్నారు.  లేటెస్ట్ గా   ఇన్వెస్టిమెంట్ ఫ్రాడ్ కేసులో ఇద్దరిని కేరళలో అరెస్ట్ చేశారు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు.  టెలిగ్రామ్ ద్వారా పార్ట్ టైమ్ జాబ్స్ పేరుతో మోసం చేస్తున్నట్లు గుర్తించారు.  సోషల్ మీడియాలో లైక్స్ చేయడం, రివ్యూలు రాస్తే మీకు డబ్బులు ఇస్తామని నమ్మించి  మొదట్లో  నమ్మించేవారు . ఆ తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే ఎక్కువ మొత్తంలో ప్రాఫిట్స్ వస్తాయని నమ్మించే వారు. ఇది నమ్మి  కొందరు బాధితులు  9 లక్షల 44 వేలు ఇన్వెస్ట్ మెంట్ చేశారు.  అయితే తర్వాత వీరి నంబర్లను బ్లాక్ చేశారు. దీంతో  మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

కేరళలో నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు.. స్కాం మొత్తం  దుబాయ్ నుంచి  ఆపరేట్ అవుతున్నట్లు గుర్తించారు. ఫ్రాడ్ చేసిన  డబ్బులన్నీ దుబాయ్ లో ఉన్న అకౌంట్స్ కి వెళ్తున్నాయి.  అమాయకుల బ్యాంక్ అకౌంట్స్ ని కమీషన్ ప్రకారం సైబర్ క్రైమ్ కోసం వాడుతున్నారు.  18 అకౌంట్ల ద్వారా మొత్తం 26 కోట్ల ట్రాన్సక్షన్ జరిగింది.  ఈ అకౌంట్స్ నుంచి క్రిప్టో ద్వారా వివిధ దేశాలకు పంపించారని సైబర్ క్రైం డీసీపీ కవిత వెల్లడించారు.