హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు అప్రెంటిస్​ జాబ్స్​కు టాప్​ లొకేషన్స్

హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు అప్రెంటిస్​ జాబ్స్​కు టాప్​ లొకేషన్స్
  • హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు అప్రెంటిస్​ జాబ్స్​కు టాప్​ లొకేషన్స్
  • వీటిలో హైదరాబాద్​కు మొదటిస్థానం
  • మిగతా స్థానాల్లో ఢిల్లీ, బెంగళూరు

ముంబై : ఐటీ/టెక్  ఇండస్ట్రీ హబ్స్​గా ఎదిగిన హైదరాబాద్, ఢిల్లీ  బెంగళూరు కిందటి ఆర్థిక సంవత్సరం నాలుగో క్వార్టర్​లో (జనవరి–-మార్చి 2023) అప్రెంటిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నియామకంలో టాప్​ లొకేషన్స్​గా నిలిచాయి.  78 శాతం నెట్​ అప్రెంటిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్ అవుట్​లుక్​ (ఎన్​ఏఓ)తో హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మొదటిస్థానంలో ఉంది. ఢిల్లీ (74 శాతం ఎన్​ఏఓ)  బెంగళూరు (68 శాతం ఎన్​ఏఓ) మిగతా స్థానాల్లో నిలిచాయి. మునుపటి ఆర్నెళ్ల (2022 జూలై-–డిసెంబర్)తో పోలిస్తే అప్రెంటిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్ బాగా పెరిగిందని టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లీజ్ అప్రెంటిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్ అవుట్​లుక్​ రిపోర్ట్ వెల్లడించింది. ఈ​ రిపోర్ట్ తయారీకి 14 నగరాలకు చెందిన  24 పరిశ్రమలు, 597 మంది ఎంప్లాయర్స్​ నుంచి వివరాలు సేకరించారు. ఈ సర్వే ఈ ఏడాది జనవరి నుండి మార్చి వరకు జరిగింది.

అంతేకాకుండా, హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 83 శాతం మంది ఎంప్లాయర్స్​, ఢిల్లీలో 82 శాతం, బెంగళూరులో 80 శాతం మంది అప్రెంటిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను పెంచే అవకాశం ఉందని రిపోర్ట్ పేర్కొంది. చెన్నై (81 శాతం), ముంబై (77 శాతం)  సత్తాను ప్రదర్శిస్తున్నాయి.  అప్రెంటిస్​ల సంఖ్యను పెంచుకోవడానికి సిద్ధమని 2022 క్యాలెండర్ సంవత్సరం మొదటి ఆర్నెళ్లలో 77 శాతం మంది యజమానులు చెప్పగా, 2023 జనవరి–-మార్చిలో 79 శాతం మంది ప్రకటించారు. రిక్రూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్  పరంగా చూస్తే మెట్రో నగరాలు ముందంజలో ఉండగా, కోయంబత్తూర్ (79 శాతం ఎన్​ఏఓ), నాగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పూర్  పూణే (ఒక్కొక్కటి 76 శాతం ఎన్​ఏఓ)  అహ్మదాబాద్ (70 శాతం ఎన్​ఏఓ) సహా నాన్–-మెట్రో నగరాలు కూడా పాజిటివ్​గా ఉన్నాయి. స్కిల్డ్​ మ్యాన్​ పవర్​ను లోటును అధిగమించేందుకు డిప్లాయ్​మెంట్​ను పెంచినట్టు కోయంబత్తూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 84 శాతం, పూణేలో 85 శాతం, నాగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 86 శాతం, అహ్మదాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 83 శాతం మంది ఎంప్లాయర్లు చెప్పారు. 

ఇంజనీరింగ్​లో ఎక్కువ...

ఇంజినీరింగ్  పారిశ్రామిక వంటి కీలకమైన పరిశ్రమలలో అప్రెంటిస్​షిప్​ బాగా పెరిగింది.  అత్యధిక ఎన్​ఏఓ ఇంజనీరింగ్​, ఇండస్ట్రియల్​లో (90 శాతం) ఉండగా, మిగతా స్థానాల్లో ఎలక్ట్రికల్  ఎలక్ట్రానిక్స్ (88 శాతం),  బ్యాంకింగ్, ఆర్థిక సేవలు  బీమా (74 శాతం) ఉన్నాయి.  ఇంజినీరింగ్, ఇండస్ట్రియల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 94 శాతం మంది ఎంప్లాయర్స్, ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 93 శాతం బీఎఫ్​ఎస్​ఐలో 85 శాతం మంది తమ అప్రెంటిస్ ఎంగేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పెంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. " హైదరాబాద్, ఢిల్లీ,  బెంగుళూలో వృద్ధి కనిపిస్తోంది. భారతదేశంలో అప్రెంటిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్ నియామకాలు  ఈ ఏడాది మరింత పెరుగుతాయని భావిస్తున్నాం. ఈ నగరాలు, ఐటీ/టెక్ పరిశ్రమకు కేంద్రాలుగా ఎదగడం వల్ల అప్రెంటిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు పుష్కలంగా అవకాశాలు ఉంటాయి. దీనివల్ల ఇండస్ట్రీకి మరింత స్కిల్​పవర్​ దొరుకుతుంది " అని టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లీజ్ ఎగ్జిక్యూటివ్​ సుమిత్ కుమార్ తెలిపారు. నిరుద్యోగాన్ని తగ్గించడం, జీవనోపాధిని మెరుగుపరచడం, స్కిల్​ డెవెలప్​మెంట్​ద్వారా అన్ని ప్రాంతాలకూ మేలు జరుగుతుందని అన్నారు.అప్రెంటిస్​తో నిరుద్యోగులకు, ఎంప్లాయర్స్​కు ప్రయోజనమని వివరించారు.