హైదరాబాద్: జర్నలిస్టుల పిల్లలకు స్కూల్ ఫీజులో50 శాతం రాయితీ...హైదరాబాద్ డీఈవో ఉత్తర్వులు

హైదరాబాద్: జర్నలిస్టుల పిల్లలకు స్కూల్ ఫీజులో50 శాతం రాయితీ...హైదరాబాద్ డీఈవో ఉత్తర్వులు

హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్ జిల్లాలోని గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న వర్కింగ్ జర్నలిస్టుల పిల్లలకు 2026-–27 విద్యా సంవత్సరానికి ఫీజులో 50 శాతం వరకు రాయితీ ఇవ్వాలని డీఈవో యాదయ్య మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్​స్కూళ్లలో 50 శాతం ఫీజు రాయితీ ఇవ్వాలని జర్నలిస్ట్​సంఘాలు వినతిపత్రం ఇవ్వగా, ఆయన సర్క్యులర్​ఇచ్చారు. 

ఫీజు మినహాయింపు పొందాలంటే గుర్తింపు పొందిన జర్నలిస్ట్ యూనియన్ ,అసోసియేషన్ జారీ చేసిన చెల్లుబాటయ్యే గుర్తింపు కార్డు (ఐడీ కార్డు) లేదా మెంబర్‌‌షిప్ సర్టిఫికెట్‌‌ను స్కూల్ యాజమాన్యాలకు సమర్పించి వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. జిల్లా పరిధిలోని  ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలన్నీ ఈ రూల్​ను అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను డీఈవో ఆదేశించారు.