
మేడిపల్లి/మేడ్చల్, వెలుగు: గణేశ్ ఉత్సవాల్లో డీజేలకు అనుమతి లేదని, ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని మల్కాజిగిరి, మేడ్చల్ ఏసీపీలు చక్రపాణి, శంకర్రెడ్డి హెచ్చరించారు. ఆదివారం పీర్జాదిగూడ, మేడ్చల్ మున్సిపల్ కార్యాలయాల్లో వారు వేర్వేరుగా గణేశ్ ఉత్సవ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మండపాల నిర్వాహకులు పోలీసుల అనుమతి పొందాలన్నారు. గొడవలు జరగని చోట ఉత్సవాలు నిర్వహించుకోవాలని సూచించారు. తొమ్మిది రోజుల్లోనే నిమజ్జనం చేయాలన్నారు.