
హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ దందాలక పాల్పడుతున్న వారిపై ఉక్కుపాదం మోపుతున్నారు నార్కోటిక్స్ పోలీసులు. అయితే ఎన్ని దాడులు చేసినా అక్కడక్కడ రహస్యంగా దందా నడుపుతూనే ఉన్నారు. బుధవారం (జులై 23) హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ ముఠా పట్టుబడటం కలకలం రేపింది.
బుధవారం నార్కోటిక్స్ వింగ్ పోలీసుల దాడుల్లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. ముంబైతో సంబంధం ఉన్న హైదరాబాద్ ముఠాను అదుపులోకి తీసుకున్నారు. కొకైన్, ఎఫిడ్రన్ సరఫరా చేస్తున్న 9 మంది డ్రగ్స్ పెడ్లర్లు అరెస్టు చేశారు పోలీసులు.
ఆరుగురు కొకైన్, మరో ముగ్గురు మియావ్ మియావ్ MD డ్రగ్ అఫెండర్స్ లను అదుపులోకి తీసుకున్నారు నార్కోటిక్ వింగ్ పోలీసులు. నిందితుల నుండి 286 గ్రాముల కొకైన్, 11 ఎక్సాటసీ పిల్స్, 12 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కంట్రీ మేడ్ తుపాకీ, ఆరు రౌండ్ల లైవ్ బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు.
ఈ దాడుల్లో వీరితోపాటు డ్రగ్ ట్రాఫికింగ్‌కు పాల్పడుతున్న మరో ఇద్దరు విదేశీయులను కూడా అదుపులోకి తీసుకున్నారు. త్వరలోనే వీరిని డిపోర్టేషన్ చేయనున్నారు.
ఈ సందర్భంగా సీపీ ఆరంద్ మాట్లాడుతూ.. కాటేదాన్ లో డ్రగ్స్ దందా చేస్తున్న మరో వ్యక్తిని పట్టుకున్నామని .. నిందితులకు ముంబైతో లింకులున్నాయని తెలిపారు. నైజీరియన్లతో పాటు ఏడు మంది అరెస్టు చేశామని.. నిందితుల్లో ఒకరు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కూడా ఉన్నారని తెలిపారు.
Hnew టీమ్ మూడు డ్రగ్స్ ముఠాలను పట్టుకున్నారు: సీపీ ఆనంద్
యాంటీ నార్కోటిక్స్ బ్యూరో పోలీసులు ముంబైతో సంబంధం ఉన్న మూడు టీంలను పట్టుకున్నట్లు సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. మొత్తం తొమ్మిది మంది ఫెడ్లర్లు, ట్రాన్స్ పోర్టర్లు లను పెట్టుకున్నట్లు చెప్పారు. ఆ దాడిలో మొత్తం 300 గ్రాముల కొకైన్, 100 గ్రాముల మెఫాడ్రిన్, ఒక పిస్టల్ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు సీపీ సీవీ ఆనంద్. ఈ సందర్భంగా సీపీ ఆనంద్ కామెంట్స్:
- పెడ్లర్లు ఆయుధాలు వినియోగిస్తారు అని అనుమానం ఉండింది..ఈరోజు నిరూపణ అయ్యింది.
- మొత్తం మూడు ముఠాలను పట్టుకుంటే.. అందులో మొదటి కేసులో మహారాష్ట్రతో లింక్ ఉంది
- హైద్రాబాద్ లో గత కొద్ది రోజుల క్రితం రవి వర్మ, సచిన్ అనే ఇద్దర్ని డ్రగ్ కేసులో పట్టుకున్నాం
- ఆ ఇద్దర్ని విచారించినపుడు ప్రేమ్ ఉపాధ్యాయ్ అనే పెడ్లర్ పాత్ర వెలుగులోకి వచ్చింది..
- 2022 లో ప్రేమ్ డ్రగ్స్ వాడటం మొదలు పెట్టాడు. నల్లకుంట, శేరిలింగంపల్లి లో అతనిపై రెండు కేసులు ఉన్నాయి
- ప్రేమ్ కు ముంబయికు చెందిన డ్రగ్ ముఠాలతో లింకులు ఏర్పడ్డాయి.
- ముంబయి కు చెందిన ముజాయిత్ అనే డ్రగ్ పెడ్లర్.. నైజీరియన్ ల నుంచి డ్రగ్స్ కొనుగోలు చేస్తాడు
- సముద్ర మార్గం ద్వారా కొకైన్ తెప్పిస్తాడు
- ముజాయిత్ తన సబ్ సప్లయర్స్ ద్వారా పెడ్లింగ్ చేస్తాడు..
- ఆర్థికంగా వీక్ గా ఉన్న ఇద్దరు ఎలక్ట్రీషియన్లను సబ్ పెడ్లర్లు గా మార్చుకున్నాడు
- ముజాయిత్ కు చెందిన సప్లయర్లు చైతన్య, ఖాన్ ఇద్దరు ముఠాగా ఏర్పడి హైదరాబాద్ లో సప్లై చేస్తున్నారు..
- ఈ ఇద్దరితో ప్రేమ్ ఉపాధ్యాయ్ వీరితో డ్రగ్స్ కొనుగోలు చేసి అమ్ముతున్నాడు
- ప్రేమ్ నుండి 276 గ్రామ్ కొకైన్ సీజ్ చేశాము. సీజ్ చేసిన కొకైన్ డ్రగ్స్ విలువ రూ.69 లక్షలు ఉంటుంది..
మెఫాడ్రిన్ డ్రగ్స్ సరఫరా చేస్తున్న రెండో గ్యాంగ్:
- ఈ రెండో గ్యాంగ్ లో పవన్ భాటి, హేమ సింగ్ కీలకంగా ఉన్నారు
- కాటేదాన్ చెందిన జితేందర్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నాము
- జితేందర్ రాజస్తాన్ కు చెందిన వాడు..చిన్న వయసులో నగరానికి వచ్చాడు
- మిఠాయి తయారీ చేయడం నేర్చుకున్నాడు.. స్వీట్ షాప్ పెట్టుకుని నష్టాలు రావడంతో మూసి వేశాడు
- ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న సమయంలో జితేందర్ కు పవన్ భాటి పరిచయం అయ్యాడు.
- ఆర్థికంగా బలపడటానికి ఇద్దరు డ్రగ్స్ అమ్మటమే మార్గం అనే నిర్ణయానికి వచ్చారు. 2022 నుండి డ్రగ్స్ విక్రయిస్తున్నారు
- సురేందర్, హనుమాన్ అనే ఇద్దరు రాజస్తాన్ కు చెందిన వారి నుండి వీళ్లు డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నారు.
- డ్రగ్స్ విక్రయం ప్రమాదకరమైన బిజినెస్ కాబట్టి ఆయుధం ఉండాలి అని జితేందర్ పవన్ భాటియా బావించారు..
- జితేందర్ పవన్ తో చర్చించి ఒక 75 వేలు తో ఒక కంట్రీ మేడ్ గన్ కొన్నాడు
- కాటేదన్ లో ఒక రౌండ్ ఫైరింగ్ చేశాడు. ఈ కేసులో మొత్తం ముఠాను పట్టుకున్నాము
మూడవ గ్యాంగ్:
- మూడవ గ్యాంగ్ బొల్లాంర పీఎస్ పరిధిలో పట్టుబడ్డారు.
- హర్ష అనే నిందితుడు బీటెక్ చదివి సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్నాడు
- గర్ల్ ఫ్రెండ్ మోసం చేసింది అని డ్రగ్స్ కు అలవాటు పడ్డాడు
- హర్ష కు గోవా కి చెందిన పెడ్లర్ క్రిస్ తో పరిచయం ఏర్పడింది..
- ముందుగా హర్ష డ్రగ్స్ వినియోగించడం మొదలు పెట్టాడు..
- అనంతరం తానే పెడ్లర్ గా మారి విక్రయించడం మొదలు పెట్టాడు
- హర్ష నుండి 10 గ్రాముల కొకైన్ ఎక్స్ టసీ పిల్ స్వాధీనం చేసుకున్నాము
- అతన్ని విచారించగా ఇద్దరు నైజీరియన్ల పాత్ర వెలుగు చూసింది
- ఇద్దరు నైజీరియన్ లు వీసా ముగిసినా కూడా ఇక్కడే ఉంటున్నారు
- క్లెమెంట్ అనే నైజిరియన్ చీటింగ్ కేసులో చండీగఢ్ లో అరెస్ట్ అయ్యాడు.
- నాలుగు నగరాల్లో తిరుగుతూ ఉన్నాడు.
- నైజీరియన్ లు అరెస్ట్ చేసి జైలుకు పంపాకా బయటకు వచ్చి మిస్ అవుతున్నారు
- NBW ఇష్యూ చేసినా కూడా వారు దొరకడం లేదు..
- అందుకే ఈ ఇద్దర్ని వారి దేశాలకు డిపోర్ట్ చేస్తాము
- విదేశీయులను డిపోర్ట్ చేయడం చాలా కష్ట సాధ్యం అయిన పని.. ఇది మాకు పనిష్మెంట్ లాంటిది
- డిపార్ట్ చేయడానికి ఎమర్జెన్సీ ట్రావెల్ సర్టిఫికెట్ పొందాలి.. అది పొందడం చాలా కస్టం
- ట్రావెల్ సర్టిఫికెట్ పొందిన తర్వాత FRRO exit పర్మిషన్ ఇస్తారు.
- అప్పుడు ఎయిర్ టికెట్ బుక్ చేయాలి..
- ఇది చాలా శ్రమతో కొడుకున్న పని.. అప్పటి వరకు వాళ్ల బాధ్యత మాది
- గత మూడేళ్లలో ఇప్పటి వరకు 33 మంది విదేశీయులు అరెస్ట్ అయ్యారు
- 19 మందిని డిపోర్ట్ చేశాము