2036 రిపోర్ట్ : హైదరాబాద్లో వందలో 17 మంది వృద్ధులే

2036 రిపోర్ట్ : హైదరాబాద్లో వందలో 17 మంది వృద్ధులే

తెలంగాణలో వృద్ధుల శాతం రోజు రోజుకు పెరుగుతోంది. తెలంగాణలో వృద్ధాప్య శాతం క్రమంగా పెరుగుతోందని  ఐక్యరాజ్య సమితి జనాభా నిధి నివేదక వెల్లడించింది. 2036 నాటికి రాష్ట్రంలో వృద్ధుల జనాభా పెరుగుదల 55 శాతానికి చేరుకుంటుందని ఐక్యరాజ్య సమితి నివేదిక అంచనా వేసింది. 

ఐక్యరాజ్యసమితి జనాభా నిధి నివేదిక ప్రకారం హైదరాబాద్, తెలంగాణలోని ఇతర జిల్లాల్లో వృద్ధుల జనాభా 2021లో 11 శాతం ఉండగా..2036 నాటికి 17.1 శాతానికి చేరుకుంటుంది. 

దేశంలో వృద్ధుల శాతం వేగంగా పెరుగుతోంది. దేశంలో 2021 లెక్కల ప్రకారం 60 ఏండ్లు పైబడిన జనాభా 10.1 శాతం ఉండగా..2036లో ఈ శాతం 15 కు పెరుగుతుందని అంచనా వేయబడింది. దీంట్లో దక్షిణాది రాష్ట్రాల వాటానే ఎక్కువ.