చలికాలంలో ఈ ఎండ ఏంటీ.. ఈ చమటలు ఏంటీ

చలికాలంలో ఈ ఎండ ఏంటీ.. ఈ చమటలు ఏంటీ

రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.  ఇది చలికాలం అయినప్పటికీ  మధ్యాహ్నం పూట ఎండలు దంచికొడుతున్నాయ్.  దీంతో నగర వాసులు ఇబ్బంది పడుతునన్నారు.  నిన్న  హైదరాబాద్ లో గరిష్ట ఉష్ణోగ్రతలు 35 డిగ్రీల సెల్సియస్‌ను అధిగమించాయి.  నిన్న, హైదరాబాద్‌లోని చాలా ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు 32 డిగ్రీలు దాటాయి.  

తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (TSDPS) ప్రకారం  అమీర్‌పేట 35.1 డిగ్రీలు, ఖైరతాబాద్ 33.3, షేక్‌పేట 33.3, మోండామార్కెట్33.0, బహదూర్‌పురా 33.0, గోల్కొండ 33.0, బండ్లగూడ 32.7, హిమాయత్‌నగర్ 32.5, మారేడ్పల్లి 32.4 డిగ్రీల సెల్సియస్‌ నమోదయ్యాయి.  ఇది రాబోయే రోజుల్లో మరింతగాపెరిగే అవకాశం  ఉందని టీఎస్ డీపీఎస్  వెల్లడించింది.   రాబోయే మూడు రోజులలో హైదరాబాద్‌లో ఎటువంటి వర్షపాతం ఉండదని టీఎస్ డీపీఎస్ అంచనా వేసింది.