చలికాలంలో ఎండాకాలం : హైదరాబాద్ సిటీలో మండుతున్న ఎండలు

చలికాలంలో ఎండాకాలం : హైదరాబాద్ సిటీలో మండుతున్న ఎండలు

ఈ ఏడాది వాతావరణానికి ఏమైంది. ఎండాకాలం వర్షాకాలంలా మారిపోయింది. వర్షాకాలం పూర్తిగా ఆగిపోయింది. ఇప్పుడేమో చలికాలం..ఎండాకాలాన్ని తలపిస్తోంది. ప్రస్తుతం చలికాలం..కానీ హైదరాబాద్ లో మాత్రం వేసవిలో ఉండే వేడిని అనుభవిస్తున్నారు ప్రజలు. 

హైదరాబాద్లోని చాలా ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 35 డిగ్రీల సెల్సియస్ను మించిపోయాయి. అంతేకాకుండా కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా ఎక్కువగానే నమోదవుతున్నాయి. వర్షాకాలం ముగిసినప్పటి నుంచి హైదరాబాద్లో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు 25 డిగ్రీల సెల్సియస్కు మంచి నమోదవుతున్నాయి. 

హైదరాబాద్లో ఉష్ణోగ్రతలు వేసవిని తలపిస్తున్నాయి. నాంపల్లిలో 35.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మోండా మార్కెట్లో 35.4, మారేడ్ పల్లిలో 35.2, షేక్ పేటలో 35.2 గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక కనిష్ట ఉష్ణోగ్రతలు 20 నుంచి 22 డిగ్రీల సెల్సియస్ పరిధిలో ఉంటున్నాయి. అయితే అక్టోబర్ 17వ తేదీన అంబర్ పేటలో కనిష్ట ఉష్ణోగ్రత అత్యధికంగా 25.3 డిగ్రీలు నమోదయ్యాయి. ఈ క్రమంలో రాబోయే రోజుల్లో హైదరాబాద్ లో చలికాలంలో వేసవి లాంటి వేడి ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.