భారీగా పెరగనున్న హలీం ధరలు.. నెల ముందే చర్చలు

భారీగా పెరగనున్న హలీం ధరలు.. నెల ముందే చర్చలు

మరో నెల రోజుల్లో రంజాన్ నెల ప్రారంభం కాబోతుంది.. ఈ క్రమంలోనే వీధుల్లో హలీం కుకింగ్ పాయింట్లు రెడీ అవుతున్నాయి. ప్రతిఏటా హలీం సేల్స్ రికార్డు స్థాయిలో పెరుగుతుండటంతో.. ఈసారి భారీ ఎత్తున హలీం సెంటర్ల ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే హలీం ధరలపై హోటల్స్ చర్చలు జరుపుతున్నది. గత ఏడాదితో పోల్చితే ఈసారి ధరలు భారీగా పెరగనున్నట్లు స్పష్టం చేశాయి. గతంలో హలీం ప్లేట్ కనీస ధర 30 రూపాయలుగా ఉండగా.. ఈసారి 40 రూపాయలకు పెంచాలని నిర్ణయించారు. అదే విధంగా హలీం క్లాసిక్ బౌల్ 200 నుంచి 250 రూపాయలు వరకు ఉంది. ఈ సారి 300 రూపాయల వరకు ఉంటుందని హోటల్స్ సంకేతాలు ఇచ్చేశాయి.

హలీం ధరలు పెరగటానికి కారణాలను హోటల్స్ స్పష్టం చేశాయి. హలీం తయారీకి ఉపయోగించే చికెన్, మటల్ ధరలు పెరగటంతోపాటు.. అందులో ఉపయోగించే డ్రైఫ్రూట్స్, నెయ్యి, కోడి గుడ్లు, ఇతర సుగంధ ద్రవ్యాల ధరలు.. గత ఏడాదితో పోల్చితే భారీగా పెరిగాయని.. దీంతో హలీం ధరలను పెంచక తప్పటం లేదని చెబుతున్నారు హోటల్స్ నిర్వాహకులు. హలీం ధరలపై ప్రతి సంవత్సరం హోటల్స్ మేనేజ్ మెంట్ సభ్యులు భేటీ అయ్యి.. కనీస ధర, అత్యధిక ధరను నిర్ణయిస్తారు. ఈసారి కూడా అలాగే భేటీ అయిన సభ్యులు.. గతంలో ఉన్న కనీస ధర 30 రూపాయలను.. ఇప్పుడు 40 రూపాయలకు పెంచాలని నిర్ణయించారు.

Also Read ; ఫిబ్రవరి 20న ఈ పనులు చేశారా... భారీ మూల్యం చెల్లించాల్సిందే...

హలీం ధరల పెంపుపై క్లారిటీకి వచ్చిన హోటల్స్ నిర్వాహకులు.. ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. మార్చి 10వ తేదీ నుంచి రంజాన్ మాసం  ప్రారంభం అవుతుంది. మరికొన్ని రోజులు మాత్రమే ఉండటంతో.. ఇప్పటి నుంచే హలీం ప్రిపరేషన్స్ మొదలుపెట్టాయి హోటల్స్..