ఫిబ్రవరి 20న ఈ పనులు చేశారా... భారీ మూల్యం చెల్లించాల్సిందే...

ఫిబ్రవరి 20న ఈ పనులు చేశారా... భారీ మూల్యం చెల్లించాల్సిందే...

హైందవ ధర్మంలో ఏకాదశికి ఉన్న ప్రాముఖ్యత మరో తిథికి లేదు. విష్ణు ఆరాధనకు ఇది అత్యంత కీలకం. ఏకాదశి వ్రతాన్ని పాటించడానికి కొన్ని ముఖ్యమైన నియమాలున్నాయి. అసలు జయ ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నా.. లేకపోయినా.. ఫిబ్రవరి 20న పొరపాటున ఈ పనులు చేయకూడదు.

హిందూ సంప్రదాయంలో పండగలకు కొదవలేదు. తిథి, వార, నక్షత్రం, యోగం, కరణం ఈ ఐదు కలిపితే పంచాంగం. అందులో పండగలకు, ఇతర ముఖ్య కార్యాలకు తిథులను ప్రామాణికంగా తీసుకుంటారు. ఆ తర్వాత నక్షత్రం, ఆ తర్వాత వారం ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఇక యేడాదిలో మనకు నెలకు 2 చొప్పున మొత్తం 24 ఏకాదశులు వస్తాయి. అధిక మాసం వచ్చినపుడు 26 ఏకాదశులు వస్తుంటాయి. అందులో ప్రతి ఏకాదశికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఇక ఫిబ్రవరి 20న రాబోయే ఏకాదశిని జయ ఏకాదశి అని పిలుస్తుంటారు. ఇక ఏకాదశి తిథి మహావిష్ణువుకు ఎంతో ఇష్టమైనది. అయితే పొరపాటున ఈ రోజున ఈ 5 పనులు చేయకండి..

జయ ఏకాదశి వ్రతం మాఘశుద్ద ఏకాదశి (ఫిబ్రవరి 20న) రోజున  ఆచరిస్తారు. సనాతన ధర్మంలో ఏకాదశికి అపారమైన మతపరమైన ప్రాముఖ్యత ఉంది. ఈ రోజు (ఫిబ్రవరి 20) విష్ణువు ఆరాధనకు అంకితం చేయబడింది. ఏకాదశి వ్రతాన్ని పాటించడానికి కొన్ని ముఖ్యమైన నియమాలు ఉన్నాయి, వీటిని పాటించడం ముఖ్యం. అదే సమయంలో, జయ ఏకాదశి రోజున కొన్ని పనులు చేయడం శుభపరిణామంగా పరిగణించబడదు. కాబట్టి, మీరు జయ ఏకాదశి వ్రతాన్ని పాటించినా, పాటించకపోయినా,  ఫిబ్రవరి 20న పొరపాటున కూడా ఈ పనులు చేయకూడదని పండితులు చెబుతున్నారు. 

అన్నం

 జయ ఏకాదశి నాడు అన్నం మెతుకు తినకూడదు. ఈ రోజు అన్నం తింటే మహా పాతకం చేసిన దోషం చుట్టుకుంటుందని పురాణాలు చెబుతున్నాయి.

 తులసి ఆకులు

విష్ణువు, మహాలక్ష్మిల ఆరాధనకు తులసీ ఆకులు అత్యంత శ్రేష్టమైనవి. తులసి ఆకులు లేకుండా భగవంతునికి నైవేద్యం పెట్టరు కూడా. జయ ఏకాదశి రోజున తులసి ఆకులు అసలు కోయకూడదు. ముట్టుకోకూడదు. తులసి ఆకులును మంగళవారం కోయడం వల్ల లక్ష్మీ దేవి కోపానికి గురవుతారని పురాణాలు చెబుతున్నాయి.

 నల్లని దుస్తులు

హిందూ మత విశ్వాసాల ప్రకారం .. ఏదైనా శుభ కార్యంలో లేదా పూజా సమయంలో నలుపు రంగు దుస్తులు ధరించకూడదు. కాబట్టి జయ ఏకాదశి రోజున నలుపు దుస్తులు ధరించకుండా ఉండండి. ఈ రోజున పసుపు రంగు దుస్తులు ధరిస్తే శ్రీ మహా విష్ణువు అనుగ్రహానికి పాత్రలు అవుతారు.

 మద్య సేవనం

జయ ఏకాదశి రోజున పొరపాటున కూడా మద్యం సేవించకూడదు. ఈ రోజన సురాపానం చేస్తే మహా విష్ణువు ఆగ్రహానికి గురవుతాడు.

 అవమానం

ఈ రోజున ఎవరినీ నొప్పించకుండా ఉండే ప్రయత్నం చేయండి. మరియు వాదనలకు దూరంగా ఉండండి. ఎవరినైనా అనుమానించడం లేదా ఎగతాళి చేయడం వంటివి మానుకోవాలి